మహేశా.. World No Tobacco Day నాడు నోట్లో ఆ బీడీ ఏందీ, సోషల్ మీడియాలో నెటిజన్లు గుస్సా

  • IndiaGlitz, [Wednesday,May 31 2023]

మత్తు కోసం , సరదాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ధూమపానానికి బానిసలుగా మారిపోతున్నారు. అది వ్యసనంగా మారిపోయి చివరికి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని చివరికి ప్రాణాలనే పొగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ సహా ప్రాణాంతక వ్యాధుల బారినపడుతూ ఆర్ధికంగానూ కుటుంబానికి ఎన్నో కష్టాలను మిగులుస్తున్నారు. ప్రజలను, సమాజాన్ని ఎంతగానో నాశనం చేస్తున్న ఈ పొగాకుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి, ఇంకా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా మే 31న అంతర్జాతీయ స్థాయిలో ‘‘ World No Tobacco Day’ను జరుపుకుంటున్నారు. ఈ రోజున అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు పొగాకు వినియోగంపై అవగాహన కల్పిస్తాయి. దీని వల్ల ప్రజలకు ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో వివరిస్తాయి.

పొగాకుకు వ్యతిరేక పోరాటంలో పలువురు స్టార్స్ :

ఇలాంటి ముఖ్యమైన రోజున కొందరు ప్రముఖులు కూడా పొగాకుకు వ్యతిరేకంగా ఏదో కార్యక్రమంలో పాల్గొనడమో, లేదా కనీసం సోషల్ మీడియాలో ఓ ట్వీటైనా వేస్తారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘‘గుంటూరు కారం’’పై ట్రోలింగ్ జరుగుతోంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఇందులో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో మహేష్ అభిమానుల సమక్షంలో 'ఎస్ఎస్ఎంబి 28' టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు.

మహేశ్ నోట్లో బీడీ పెట్టుకుని రావడాన్ని తప్పుబడుతున్న నెటిజన్లు :

సదరు గ్లింప్స్‌లో కర్రసాము చేస్తూ రౌడీ గ్యాంగ్ ని చితక్కొడుతూ మహేశ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. అంతా బాగానే వుంది కానీ.. మహేశ్ నోట్లో నుంచి స్టైల్‌గా బీడీ తీసి దానిని వెలిగించుకుంటూ వస్తారు. అంతేనా ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ త్రీడీలో కనపడుతుందా అంటూ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ కూడా చెబుతారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

ఫ్యాన్స్‌పై విశేష ప్రభావం చూపించగల మహేశ్ :

అయితే World No Tobacco Day నాడు మహేశ్ బీడీ కాల్చుకుంటూ వచ్చే సీన్‌ను రిలీజ్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. కోట్లాది మంది అభిమానులున్న అలాంటి వ్యక్తులు చేసే పనుల్ని ఫ్యాన్స్ అనుకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల పొగాకు వ్యతిరేక దినోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాల స్పూర్తి దెబ్బ తింటుందని పలువురు అంటున్నారు.

More News

Dear Zindagi: వినాయక్ క్లాప్ తో రాజా రవీంద్ర 'డియర్ జిందగీ' ప్రారంభం

ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే

Guntur Kaaram: గ్లింప్స్‌తో మాస్ ట్రీట్ ఇచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ - త్రివిక్రమ్ 'గుంటూరు కారం'

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.

The Constable: 'ది కానిస్టేబుల్'గా వస్తున్న వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న "ది కానిస్టేబుల్" చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి.

మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు.. అవాక్కయిన జనం, ఎక్కడంటే..?

అఘోరాలు.. వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో వీరికి ప్రత్యేక స్థానం, గుర్తింపు వుంది. కుటుంబాన్ని , సంసార బాధ్యతలను వదిలేసి పరమేశ్వరుడి సేవకే వీరు జీవితాన్ని అంకితం చేస్తారు.

Pushpa 2: పుష్ప 2 యూనిట్‌తో వస్తున్న బస్సుకు ప్రమాదం.. ఆర్టిస్టులకు గాయాలు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి.