మహేశా.. World No Tobacco Day నాడు నోట్లో ఆ బీడీ ఏందీ, సోషల్ మీడియాలో నెటిజన్లు గుస్సా
Send us your feedback to audioarticles@vaarta.com
మత్తు కోసం , సరదాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ధూమపానానికి బానిసలుగా మారిపోతున్నారు. అది వ్యసనంగా మారిపోయి చివరికి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని చివరికి ప్రాణాలనే పొగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ సహా ప్రాణాంతక వ్యాధుల బారినపడుతూ ఆర్ధికంగానూ కుటుంబానికి ఎన్నో కష్టాలను మిగులుస్తున్నారు. ప్రజలను, సమాజాన్ని ఎంతగానో నాశనం చేస్తున్న ఈ పొగాకుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి, ఇంకా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా మే 31న అంతర్జాతీయ స్థాయిలో ‘‘ World No Tobacco Day’ను జరుపుకుంటున్నారు. ఈ రోజున అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు పొగాకు వినియోగంపై అవగాహన కల్పిస్తాయి. దీని వల్ల ప్రజలకు ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో వివరిస్తాయి.
పొగాకుకు వ్యతిరేక పోరాటంలో పలువురు స్టార్స్ :
ఇలాంటి ముఖ్యమైన రోజున కొందరు ప్రముఖులు కూడా పొగాకుకు వ్యతిరేకంగా ఏదో కార్యక్రమంలో పాల్గొనడమో, లేదా కనీసం సోషల్ మీడియాలో ఓ ట్వీటైనా వేస్తారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘‘గుంటూరు కారం’’పై ట్రోలింగ్ జరుగుతోంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఇందులో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో మహేష్ అభిమానుల సమక్షంలో 'ఎస్ఎస్ఎంబి 28' టైటిల్, గ్లింప్స్ విడుదల చేశారు.
మహేశ్ నోట్లో బీడీ పెట్టుకుని రావడాన్ని తప్పుబడుతున్న నెటిజన్లు :
సదరు గ్లింప్స్‌లో కర్రసాము చేస్తూ రౌడీ గ్యాంగ్ ని చితక్కొడుతూ మహేశ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. అంతా బాగానే వుంది కానీ.. మహేశ్ నోట్లో నుంచి స్టైల్‌గా బీడీ తీసి దానిని వెలిగించుకుంటూ వస్తారు. అంతేనా ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ త్రీడీలో కనపడుతుందా అంటూ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ కూడా చెబుతారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్‌పై విశేష ప్రభావం చూపించగల మహేశ్ :
అయితే World No Tobacco Day నాడు మహేశ్ బీడీ కాల్చుకుంటూ వచ్చే సీన్‌ను రిలీజ్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. కోట్లాది మంది అభిమానులున్న అలాంటి వ్యక్తులు చేసే పనుల్ని ఫ్యాన్స్ అనుకరిస్తారు. ఇలాంటి వాటి వల్ల పొగాకు వ్యతిరేక దినోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాల స్పూర్తి దెబ్బ తింటుందని పలువురు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout