కీరవాణిపై నెటిజన్ల విసుర్లు...

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత తానింక సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తాన‌ని చెప్పిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి. రీసెంట్‌గా బాహుబ‌లి 2 ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్‌తో కీర‌వాణి ఇరుకున ప‌డ్డారు. తెలుగులో బ్రెయిన్ లెస్ ద‌ర్శ‌కులు ఎక్కువ‌ని, తాను ఇక అటువంటి ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌న‌ని కీర‌వాణి చెప్పిన సంగ‌తి తెలిసిందే.
అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు తీవ్ర అసంతృప్తిని వెళ్ళ‌గ‌క్కుతున్నారు. రాజ‌మౌళి గొప్ప ద‌ర్శ‌కుడే అయినా ఇత‌ర ద‌ర్శ‌కుల‌ను ఇలా కించ‌ప‌ర‌డం స‌బ‌బు కాద‌ని రివ‌ర్స్ అయ్యారు. డైరెక్ట‌ర్స్ అంద‌రూ వారి వారి కుటుంబాల‌ను పోషించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. మీరు మాత్రం కాపీ ట్యూన్స్ కొట్ట‌లేదా ..అని ఒక వ్య‌క్తి బాహుబ‌లి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్క‌డ నుండి కాపీ కొట్టారో ఆ ట్యూన్‌ను కీర‌వాణికి పోస్ట్ చేశార‌ట‌. మ‌రి దీనిపై కీర‌వాణి కామ్ అవుతారో..లేక ఏమైనా స‌మాధానం చెబుతారో చూడాలి.

More News

ఉగాది సందర్భంగా 'అమీ తుమీ' ఫస్ట్ లుక్ విడుదల!

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ". వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు.

'రోగ్'తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా వుంది - ఇషాన్

డాషింగ్డైరెక్టర్పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'చిరుత'తో హీరోగా పరిచయమైన రామ్చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా స్టార్ హీరో ఇమేజ్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

తెలుగు సినీ రచయితల సంఘం ఆధ్వర్యంలో వైభవంగా ఉగాదివేడుకలు

హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించింది తెలుగు సినీ రచయితల సంఘం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా.యన్ గోపి పాల్గొన్నారు.

'నోటుకు పోటు' సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : ఎస్. కె. బషీద్

ఎస్ బి కె ఫిలిం కార్పొరేషన్ లో,ఎస్.కె బషీద్ దర్శకత్వంలో,ఎస్ కె కరీమున్నీసా నిర్మించిన చిత్రం 'నోటుకు పోటు'.

సమ్మర్ స్పెషల్ గా జయ బి. 'వైశాఖం'

ఆర్.జె.సినిమాస్ బేనర్ పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'వైశాఖం'.