Kiara advani : సామాన్యుల్లా మెట్రో ఎక్కిన వరుణ్ ధావన్ - కియారా.. నెటిజన్ల ఫైర్, ఏం జరిగిందంటే..?

కొన్ని సార్లు సరదాగా చేసే పనులు అప్పుడప్పుడు చిక్కుల్లో పడేస్తాయి. చిన్న విషయమేనని వదిలి వేసే సంఘటనలు సైతం పీకల మీదకు తెస్తాయి. ఎంతో మంది జీవితంలో ఇది అనుభవమే. ఇందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా అతీతం కాదు. కాకపోతే సెలబ్రెటీ స్టేటస్ కారణంగా విషయం ఇంకాస్త పెద్దదవుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కియారా అద్వానీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మైట్రోలో ప్రయాణించిన వరుణ్ ధావన్, కియారా :

వివరాల్లోకి వెళితే.. వరుణ్ ధావన్, కియారా జంటగా నటించిన ‘జుగ్‌ జుగ్‌ జియో’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఈ జంట బిజీగా గడుపుతోంది. దీనిలో భాగంగా వీరు ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉండగా రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్ వల్ల ఆలస్యమవుతుందని భావించారు. అందుకని ముంబయి మెట్రో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరితో పాటు సీనియర్ నటుడు అనిల్‌ కపూర్‌ కూడా ఉన్నారు. అయితే సాధారణ ప్రయాణీకుల్లో వీరు మెట్రోలో రావడంతో అభిమానులు వీరితో సెల్ఫీలు , ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతవరకు బాగానే ఉందిగానీ నిబంధనలకు విరుద్ధంగా కియారా, వరుణ్‌‌లు మెట్రోలో వడాపావ్‌ తినడం వివాదానికి కారణమైంది.

నిబంధనలు సామాన్యులకేనా.. సెలబ్రెటీలకు కాదా :

దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. మెట్రో రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదనే విషయం మీకు తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. వీఐపీలు, సెలబ్రెటీలైతే మీకు నిబంధనలు వర్తించవా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అద్వాణీ కీలక పాత్రలు పోషించిన ‘జుగ్‌ జుగ్‌ జియో’ ఈ నెల 24న విడుదలకానుంది. రాజ్‌ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

టాలీవుడ్‌లోనూ దూసుకెళ్తోన్న కియారా:

ఇక సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్‌లోనూ కియారా అద్వానీ హీరోయిన్‌గా మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’ , రామ్ చరణ్ పక్కన ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఆర్సీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమాలోనూ కియారా అద్వానీ  నటిస్తోంది.

More News

Janasena party : జనానికి పనిచేయండి... ఓట్లు వేయించండి : జనసైనికులకు నాగబాబు దిశానిర్దేశం

వీర మహిళలు, జనసైనికులు, నాయకులు సాధ్యమైనంత వరకూ ప్రజల్లో ఉండాలని సూచించారు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, సినీనటుడు నాగబాబు.

Ravi Teja: రవితేజ చేతుల మీదుగా 'చోర్ బజార్' నుంచి 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరి ‘‘చోర్ బజార్’’ సినిమాను సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ స్టార్ రవితేజ. ఈ చిత్రంలోని 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్'  లిరికల్ సాంగ్

Sumanth: ఆకట్టుకుంటున్న సుమంత్ "అహం రీబూట్" ఫస్ట్ గ్లింప్స్

సుమంత్ హీరోగా  న‌టిస్తున్న కొత్త సినిమా "అహాం రీబూట్". ఈ  చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో

ys sharmila: షర్మిల నియోజకవర్గం ఫిక్స్.. ‘‘పాలేరు’’ నుంచి బరిలోకి.. అక్కడే ఎందుకంటే..?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు వైఎస్ షర్మిల.

LPG Connection : సామాన్యుడిపై మరో భారం.. గ్యాస్ కనెక్షన్ డిపాజిట్ భారీగా పెంపు, ఎంతంటే..?

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు.