Kiara advani : సామాన్యుల్లా మెట్రో ఎక్కిన వరుణ్ ధావన్ - కియారా.. నెటిజన్ల ఫైర్, ఏం జరిగిందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని సార్లు సరదాగా చేసే పనులు అప్పుడప్పుడు చిక్కుల్లో పడేస్తాయి. చిన్న విషయమేనని వదిలి వేసే సంఘటనలు సైతం పీకల మీదకు తెస్తాయి. ఎంతో మంది జీవితంలో ఇది అనుభవమే. ఇందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా అతీతం కాదు. కాకపోతే సెలబ్రెటీ స్టేటస్ కారణంగా విషయం ఇంకాస్త పెద్దదవుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, కియారా అద్వానీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మైట్రోలో ప్రయాణించిన వరుణ్ ధావన్, కియారా :
వివరాల్లోకి వెళితే.. వరుణ్ ధావన్, కియారా జంటగా నటించిన ‘జుగ్ జుగ్ జియో’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఈ జంట బిజీగా గడుపుతోంది. దీనిలో భాగంగా వీరు ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉండగా రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్ వల్ల ఆలస్యమవుతుందని భావించారు. అందుకని ముంబయి మెట్రో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరితో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఉన్నారు. అయితే సాధారణ ప్రయాణీకుల్లో వీరు మెట్రోలో రావడంతో అభిమానులు వీరితో సెల్ఫీలు , ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతవరకు బాగానే ఉందిగానీ నిబంధనలకు విరుద్ధంగా కియారా, వరుణ్‌లు మెట్రోలో వడాపావ్ తినడం వివాదానికి కారణమైంది.
నిబంధనలు సామాన్యులకేనా.. సెలబ్రెటీలకు కాదా :
దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. మెట్రో రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదనే విషయం మీకు తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. వీఐపీలు, సెలబ్రెటీలైతే మీకు నిబంధనలు వర్తించవా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియారా అద్వాణీ కీలక పాత్రలు పోషించిన ‘జుగ్ జుగ్ జియో’ ఈ నెల 24న విడుదలకానుంది. రాజ్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
టాలీవుడ్‌లోనూ దూసుకెళ్తోన్న కియారా:
ఇక సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్‌లోనూ కియారా అద్వానీ హీరోయిన్‌గా మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’ , రామ్ చరణ్ పక్కన ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఆర్సీ 15’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలోనూ కియారా అద్వానీ నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com