ష్.. ఏంటిది అషూ.. టూ మచ్‌గా లేదా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
మాధ్యమం ఏదైనా మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడాలి. ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి.. పనైపోయిందనుకుని చేతులు దులిపేసుకుంటే ఎలా? అది కూడా సోషల్ మీడియా ఓ రేంజ్లో విస్తరించిన ఈ కాలంలో.. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మీడియా సైతం సోషల్ మీడియాపై ఆధారపడుతున్న ఈ సమయంలోనా.. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇటీవల బిగ్‌బాస్ భామ, ఆషూరెడ్డి అనే ఓ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని కలిసింది. ఆయనను కలిసిన ఫోటోలు.. ఆయన సైన్ చేసిన లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతటితో ఆగిందా.. అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది.
అదే ఆమె కొంపముంచింది. ఆషు పోస్టుపై స్పందించిన నెటిజన్లు... రకరకాల ప్రశ్నలడిగారు. అమ్మడు దేనికీ తడబడకుండా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘ఒకవేళ పవన్ కళ్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని ఒక వ్యంగ్య ప్రశ్న వేశాడు. దీనికి ఆషు ‘ఎస్’ అని రిప్లై ఇచ్చింది. నిజానికి పవన్‌కు చాలా పెద్ద అభిమానిగా చెప్పుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అలాంటి ప్రశ్న అడిగితే ఆయన వ్యక్తిగత విషయాలతో నీకేం పనంటూ ఫైర్ అవ్వాల్సిందో పోయి చేసుకుంటానని సమాధానం ఇచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా క్యాచ్ చేసింది. ‘పవన్‌తో నాలుగో పెళ్లికి సైతం సిద్ధమంటున్న ఆషు’ అంటూ వార్తలు రాసేసింది. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టు ఇన్నాళ్లకు ఆమెకు కళ్లు తెరుచుకున్నట్టున్నాయి. ఇప్పుడు పిచ్చి రాతలు రాస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. అనాల్సినదంతా అనేసి తర్వాత వేరే వాళ్ల పేరును బదనాం చేస్తున్నారు.. మీ రాతల వల్ల వేరొకరి పేరును నాశనం చేయవద్దంటూ మాట్లాడేస్తే ఎలా? అని నెటిజన్లు వాపోతున్నారు. మరీ టూమచ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ మధ్య సోషల్ మీడియాలో నాపై పిచ్చిరాతలు రాస్తున్నారు. నాకు పవన్‌కల్యాణ్‌గారు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. అభిమానం అంటే ఎప్పటికైనా అభిమానమే.. దాన్ని వేరేలా ఆపాదిస్తూ పిచ్చి రాతలు రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. సానుకూలతను పంచాల్సిన వాళ్లే చెడును విస్తరిస్తూ వేరే వాళ్ల పేరును బదనాం చేస్తూ రాయడం సరైంది కాదు. దీని వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి వాటి వల్ల పవన్‌కల్యాణ్‌గారు తన అభిమానులను కలవాలంటేనే ఆలోచించే స్థితికి తీసుకెళుతున్నారు. నిజానికి ఇలాంటి వార్తలపై స్పందించకూడదు. కానీ.. నాకు ఓపిక నశించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరనుకున్నట్లు నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక అభిమాని అంటే చచ్చేంతవరకూ అభిమానిలాగే ఉంటారు. అంతేగాని ఇంకేమీ ఉండదు. మీ రాతల వల్ల ఉన్న పేరును దయచేసి నాశనం చేయవద్దు’ అంటూ ఆమె పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com