జక్కన్నా.. ఏంటిది.. ఎందుకింత సస్పెన్స్!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్‌గానీ.. కనీసం ఆర్ఆర్ఆర్‌కు అర్థమేంటో కూడా దర్శకుడు చెప్పకపోవడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే ఇవాళ న్యూ ఇయర్ కావడంతో కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ చేస్తారని మెగాభిమానులు, నందమూరి అభిమానులు, జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూశారు. అంతేకాదు.. సినిమాకు సంబంధించి పోస్టర్ ప్రిపేర్ చేస్తున్నారని నెల కిందటి నుంచే వార్తలు గుప్పుమన్నాయ్. కానీ.. ఊరించి ఊరించి జక్కన్న మాత్రం ఉసూరుమనిపించడం గమనార్హం.
సింపుల్‌గా హ్యాపీ న్యూ ఇయర్ 2020 అంటూ పాత ఫొటోను కాస్త కొత్తగా విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఔత్సాహికులు బాగా హర్ట్ అయ్యారు. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ‘జక్కన్నా.. ఇది చాలా దారుణం’ అంటూ తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మరో బ్రహ్మానందం ప్రస్టేషన్‌తో ఉన్న ఎమోజీలు, జిఫ్ ఇమేజీలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. రజనీకాంత్, రష్మిక మందన్నా డైలాగ్స్ ఫొటోలపై రాసి పోస్ట్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. న్యూ ఇయర్ వేళ ఏదో అనుకుని జక్కన్న అండ్ టీమ్ విష్ చేస్తే.. చీవాట్లు మాత్రం గట్టిగానే పడుతున్నాయ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో..? అసలు ఎందుకింత సస్పెన్స్ పెడుతున్నారో ఏంటో రాజమౌళికే తెలియాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com