దక్షిణాదిపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్

  • IndiaGlitz, [Saturday,November 07 2020]

తనను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ.. హీరోయిన్ల కాళ్లు, బొడ్డుపైనే వారి దృష్టి ఉంటుందంటూ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది సినిమాల కారణంగా పాపులర్ అయ్యి.. స్టార్ హీరోయిన్‌గా కోట్లు వెనుకేసుకుంటున్న పూజా.. ఇలా మాట్లాడటం సబబు కాదని నెటిజన్లు మండి పడుతున్నారు.

దక్షిణాదిని కించపరిచే బదులు ఆమె అసలు అలాంటి పాత్రల్లో నటించనని చెబితే బాగుంటుంది కదా అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. స్టార్ హోదా ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షక లోకానికి పూజా తగిన గుణపాఠం చెప్పిందని... ఇక తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలంటూ ఒకింత ఘాటుగానే విమర్శిస్తున్నారు. సౌత్ ఇండియాలోనే టాప్ రేటెడ్ హీరోయిన్ అయిన పూజా.. ఇలా నోటికొచ్చిందల్లా మాట్లాడి కూర్చున్న కొమ్మను నరికేసుకుంటోందంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తారు. అసలు దీనివల్ల పూజా చెప్పదలుచుకున్నదేంటనేది కొందరి వాదన. అందం, అభినయం లేకున్నా.. రాణించవచ్చనేనా? ఆమె ఉద్దేశమని వ్యాఖ్యానిస్తున్న వాళ్లూ లేకపోలేదు.

ఇదే ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను సైతం పూజా హెగ్డే చేసింది. హీరోలకు సమానంగా హీరోయిన్లకూ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక ‘రాధేశ్యామ్’ గురించి మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇటలీ వెళ్లి షూటింగ్‌ చేయడం రిస్క్‌ అనే చెప్పాలి. మొదటి రెండురోజులు భయపడినప్పటికీ క్రమేణా తగ్గిపోయిందని వెల్లడించింది. . ప్రభాస్‌ అనుకున్నంత సిగ్గుపడే వ్యక్తి కాదు. ఎదుటి మనుషుల ప్రవర్తన, మాట తీరును బట్టి ఆయన రియాక్ట్‌ అవుతారని తెలిపింది. తానెప్పుడు పాజిటివ్‌గా ఉంటానని... సోషల్‌ మీడియాలో నెగెటివ్‌గా మాట్లాడేవారికి, ట్రోల్‌ చేసేవారికీ థ్యాంక్స్‌ చెబుతానని.. ఏ కామెంట్‌ చేయనని వెల్లడించింది. ఎవరినీ తక్కువ చేయడం, అసహ్యించుకోవడం తనకు తెలియదని పూజా చెప్పుకొచ్చింది.

More News

వెబ్ సిరీస్‌ వైపు బన్నీ అడుగులు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ డమ్ రాగానే హీరో హీరోయిన్లంతా బిజినెస్‌పై దృష్టి సారించడం కామన్.

అమెరికా అధ్యక్ష పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ

అమెరికా అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే విజయానికి జో బైడెన్ మాత్రం మరింత చేరువయ్యారు.

నట విశ్వరూపానికి కేరాఫ్‌ కమల్‌హాసన్‌

క‌మ‌ల్‌హాస‌న్‌.. యూనివ‌ర్స‌ల్ స్టార్

హ్యపీ బర్త్‌డే టు మాటల మాంత్రికుడు, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌... టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు..

జో బైడెన్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన చంద్రశేఖర శర్మ

అమెరికాలో ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడే అవకాశముంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు దాదాపు 45 రాష్ట్రాల్లో పూర్తయింది.