తుఫానులో నటి హాట్ ఫోటోషూట్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్ర, గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో టౌటే తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో తుఫాన్ ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు రోడ్డుకి అడ్డంగా విరిగిపడ్డాయి. ఇలా తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నప్పుడు ఎవరైనా ఇంట్లోనుంచి కదలకూడదు అనుకుంటారు. చిన్నపాటి వర్షం అయితే చిన్న పిల్లలు కూడా సరదాగా బయటకు వస్తారు. ఆటలాడుకుంటారు.
ఇక వర్షంలో డాన్స్ చేయడం సినిమాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. హీరోయిన్లపై వచ్చిన వర్షం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. కానీ తుఫాన్ లో డాన్స్ చేయాలని ఎవరూ అనుకోరు. కానీ ఈ వింత ఆలోచన సీరియల్ నటి దీపికా సింగ్ కి వచ్చింది. డాన్స్ మాత్రమే కాదు విరిగిన చెట్ల మధ్య హాట్ హాట్ గా ఫోటో షూట్ కూడా చేసింది.
'తుఫానుని ఆపాలని ప్రయత్నించకండి.. మీరు ఆపలేరు. అలాగని సైలెంట్ గా ఉండకండి. ప్రకృతికి కౌగిలించుకోండి. తూఫాన్ తనంతట తానే వెళ్ళిపోతుంది అంటూ దీపికా సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో షూట్ పోస్ట్ చేసింది. తమ ఇంటి ముందే ఈ చెట్లు విరిగిపడ్డాయని, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని దీపికా సింగ్ తెలిపింది.
తుఫాన్ లో ఇలాంటి ఫోటో షూట్ చేయడం పట్ల నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. సెలెబ్రిటీ అయి ఉండి ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. ఇలాంటి సమయాల్లో బయటకు రావడమే తప్పు. అలాంటిది ప్రమాదకరంగా విరిగిన చెట్ల మధ్య షూట్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దీపికా సింగ్ 'దియా ఔర్ బాతీ హమ్' అనే టీవీ సీరియల్ లో నటించింది. తెలుగులో 'ఈ తరం ఇల్లాలు' పేరుతో ఈ సీరియల్ ప్రసారం అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments