తుఫానులో నటి హాట్ ఫోటోషూట్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

మహారాష్ట్ర, గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో టౌటే తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో తుఫాన్ ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు రోడ్డుకి అడ్డంగా విరిగిపడ్డాయి. ఇలా తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నప్పుడు ఎవరైనా ఇంట్లోనుంచి కదలకూడదు అనుకుంటారు. చిన్నపాటి వర్షం అయితే చిన్న పిల్లలు కూడా సరదాగా బయటకు వస్తారు. ఆటలాడుకుంటారు.

ఇక వర్షంలో డాన్స్ చేయడం సినిమాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. హీరోయిన్లపై వచ్చిన వర్షం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. కానీ తుఫాన్ లో డాన్స్ చేయాలని ఎవరూ అనుకోరు. కానీ ఈ వింత ఆలోచన సీరియల్ నటి దీపికా సింగ్ కి వచ్చింది. డాన్స్ మాత్రమే కాదు విరిగిన చెట్ల మధ్య హాట్ హాట్ గా ఫోటో షూట్ కూడా చేసింది.

'తుఫానుని ఆపాలని ప్రయత్నించకండి.. మీరు ఆపలేరు. అలాగని సైలెంట్ గా ఉండకండి. ప్రకృతికి కౌగిలించుకోండి. తూఫాన్ తనంతట తానే వెళ్ళిపోతుంది అంటూ దీపికా సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో షూట్ పోస్ట్ చేసింది. తమ ఇంటి ముందే ఈ చెట్లు విరిగిపడ్డాయని, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని దీపికా సింగ్ తెలిపింది.

తుఫాన్ లో ఇలాంటి ఫోటో షూట్ చేయడం పట్ల నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. సెలెబ్రిటీ అయి ఉండి ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు. ఇలాంటి సమయాల్లో బయటకు రావడమే తప్పు. అలాంటిది ప్రమాదకరంగా విరిగిన చెట్ల మధ్య షూట్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దీపికా సింగ్ 'దియా ఔర్‌ బాతీ హమ్‌' అనే టీవీ సీరియల్ లో నటించింది. తెలుగులో 'ఈ తరం ఇల్లాలు' పేరుతో ఈ సీరియల్ ప్రసారం అయింది.

More News

టెర్రరిస్ట్‌గా సమంత యాక్టింగ్‌పై సెలబ్రిటీల రియాక్షన్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ బుధవారం రిలీజయ్యింది. అది అక్కినేని నాగచైతన్యకు నచ్చింది. ఆల్రెడీ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ పెద్ద హిట్.

పవన్ సినిమాపై రూమర్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

గబ్బర్ సింగ్ చిత్రంతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించాడు గణేష్. గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణానికి గణేష్ దూరంగా ఉంటున్నాడు.

రఘురామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్.. నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు

వృత్తి పరంగా ఆమె ఒక కానిస్టేబుల్.. ప్రవృత్తి డబ్బున్న వారిని పెళ్లి పేరుతో మోసం చేయడం.. ఒకరు కాదు..

పీపీఈ కిట్ లేకుండా గాంధీ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి గాంధీలోని కరోనా రోగులను పరామర్శించారు.