వరుణ్ ఆ అమ్మాయినే చేసుకుంటానంటే ఏం చేస్తారు?: నాగబాబుతో నెటిజన్
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ సమయం ఎవరికి ఎలా ఉన్నా కూడా యంగ్ హీరోలకు మాత్రం బాగా కలిసొచ్చింది. చాలా వరకూ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. ఇక ఇండస్ట్రీలో మిగిలిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ అంటే ప్రభాస్, సాయితేజ్, వరుణ్ తేజ్ తదితరులు. అయితే ప్రభాస్ గురించి అభిమానులు అడిగీ అడిగీ అలిసి పోయారు. ప్రస్తుతానికైతే ప్రభాస్ పెళ్లి ఊసు మాత్రం తేవడం లేదు. ఇక పోతే సాయితేజ్, వరుణ్ తేజ్. మెగా డాటర్ నిహారిక పెళ్లైన వెంటనే నెక్ట్స్ పెళ్లి సాయి తేజ్దేనంటూ ప్రచారం జరిగింది. అయితే సాయితేజ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. దీంతో అభిమానులు కామ్ అయిపోయారు.
ఇక వరుణ్ తేజ్.. చేసుకోనని చెప్పడు.. చేసుకుంటానని చెప్పడు. పెళ్లిపై ఎలాంటి కామెంట్ చేయడు. అయితే వరుణ్ తేజ్ ఓ యంగ్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయినప్పటికీ వరుణ్ తేజ్ మాత్రం పెళ్లిపై ఇంతవరకూ స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నాగబాబు మాత్రం తన కొడుకు వరుణ్ పెళ్లిపై స్పందించారు. గతంలో వరుణ్‌కి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని తేల్చి చెప్పిన నాగబాబు.. తాజాగా వరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుందన్న సంకేతాలైతే ఇచ్చేశారు.
తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా నాగబాబు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ పెళ్లిపై ఎక్కువగా నాగబాబుకు ప్రశ్నలు తలెత్తాయి. 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మంచి సంబంధాలు ఉంటే చూడండని నాగబాబు రిప్లై ఇచ్చారు. 'వరుణ్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్ తోనే లైఫ్ అనుకొని ఆ అమ్మాయినే చేసుకుంటా.. అదే ఫిక్స్ అంటే మీరు ఏం చేస్తారు?' అని మరో నెటిజన్ అడగ్గా.. మీకు ఓకే అయితే తనేదేముందని రిప్లై ఇచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వరుణ్ పెళ్లికి.. అమ్మాయి రేంజ్‌కి నాగబాబు ముడి పెట్టబోరంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments