సింగర్ సునీతను లైవ్‌లో వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజన్..

  • IndiaGlitz, [Monday,May 10 2021]

ప్రముఖ సింగర్ సునీత ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విస్తరిస్తున్న తరుణంలో తనవంతు సాయంగా ఓ వినూత్న కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే.. ప్రతిరోజు రాత్రి ఓ అరగంట పాటు అభిమానులకు ఇష్టమైన పాటలు పాడుతూ అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు యత్నిస్తున్నారు. ఇన్‌స్టా లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ అలరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్‌ పొందుతున్నామని అంటున్నారని, అందుకే ప్రతిరోజూ లైవ్‌కి వస్తానని తెలిపారు.

నెటిజన్లకు ఇష్టమైన పాటలు పాడుతూనే సునీత.. అభిమానులు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెబుతూ వస్తున్నారు. కాగా.. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నానని ఆమె తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అయితే, కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు లైవ్ ఇన్‌స్టాగ్రాం ద్వారా లైవ్‌లోకి వస్తున్నానని తెలిపారు. అత్యవసరమైన పనులు లేకపోతే ఇంటిపట్టునే ఉండాలని అభిమానులను కోరారు. కాగా... నిన్న మదర్స్‌ డే సందర్భంగా ఓ పాట పాడమని నెటిజన్‌ అడగ్గా సునీత ఎమోషనల్‌ అయ్యారు. అనంతరం అమ్మకు సంబంధించిన పాటలు పాడి అలరించారు.

కాగా.. సునీత పాటలు పాడుతుండగానే మరో నెటిజన్‌.. వాట్సాప్‌ నెంబర్‌ చెప్పమని అడిగాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఆసుపత్రుల్లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, బెడ్స్‌ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని తెలిపారు. కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని అత్యవసరమైతే తప్ప.. ఎవరకూ బయటకు రావొద్దని సూచించారు. తాను కూడా కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు.

More News

ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ కరోనాతో మృతి

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్ఆర్) నేడు కరోనాతో మృతి చెందారు.

ఆసుపత్రులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

భారత్‌లో కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. లక్షల్లో జనం కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులు సైతం చేతులెత్తేస్తున్నాయి.

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడి‌గా వల్లభనేని అనిల్ ఎన్నిక

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి.

బన్నీకి గ్రీటింగ్ పంపించిన చెర్రీ దంపతులు

కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది.

బతుకుతాననే ఆశ లేదంటూ పోస్టు పెట్టిన కాసేపటికే నటుడి మృతి..

కరోనా మహమ్మారి జన జీవితాలను ఎంత విచ్ఛిన్నం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలను చూస్తూనే ఉన్నాం.