నెటిజన్లకు బహిరంగ క్షమాపణ చెప్పిన నెట్‌ఫ్లిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. నెట్‌ఫిక్స్‌లో ఓ ఆంగ్ల సినిమాకు సంబంధించి పెట్టిన పోస్టర్లపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు పిటిషన్లు కూడా వేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ బహిరంగ క్షమాపణ చెప్పింది.
అసలు విషయంలోకి వెళితే.. ‘మిగ్నొన్నెస్’ అనే ఫ్రెంచ్ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో ‘క్యూటీస్’ పేరుతో సెప్టెంబర్‌లో నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయని చిన్నారుల్లో అసభ్య ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ దిగిరాక తప్పలేదు. ‘‘క్యూటీస్’ సినిమా కోసం అసభ్యంగా ఉన్న పోస్టర్లను వినియోగించినందుకు క్షమాపణ చెప్తున్నాం. ఈ పోస్టర్లు సరిగా లేవు. పోస్టర్లతో పాటు సినిమాకు సంబంధించిన వివరాలను మారుస్తున్నాం’’ అని ట్విట్టర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
‘క్యూటీస్’ కథేంటంటే..
పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌కు చెందిన 11 ఏళ్ల ముస్లిం బాలిక జీవితాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఓ వైపు కుటుంబ కట్టుబాట్లు.. మరోవైపు ఆసక్తి రేకెత్తించే ఇంటర్నెట్ కల్చర్ మధ్య నగిలిపోయిన ఆ ముస్లిం బాలిక కట్టుబాట్లను తెంచుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టాలని భావిస్తుంది. దీని కోసం ఆ బాలిక ఓ డ్యాన్స్ గ్రూప్‌లో చేరుతుంది. ఆ గ్రూప్‌లో ఉండేవారంతా అటు ఇటుగా ఆ బాలిక వయసుకు సమానమైన బాలికలే. వీరందరి మధ్య సాగే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపొందింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout