Chiranjeevi:మెగాస్టార్ ఇంటికి విశిష్ట అతిథి.. చిరంజీవి, రామ్‌చరణ్‌లతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ, పెద్ద ప్లానే వుందా..?

  • IndiaGlitz, [Friday,December 08 2023]

హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి గురువారం విశిష్ట అతిథి విచ్చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ గురువారం నగరానికి వచ్చారు. విమానాశ్రయంలో అడుగుపెట్టిన అనంతరం ఆయన నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ చిరు ఆయన కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు టెడ్ సరాండోస్‌కు ఘనస్వాగతం పలికి ఆతిథ్యం అందజేశారు. ఈ సందర్భంగా వీరు కాసేపు ముచ్చటించుకున్నారు. సినిమా నిర్మాణం, ఓటీటీ కంటెంట్ తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సరాండోస్ వచ్చిన సమయంలోనే మెగా హీరోలు సాయిథరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్రమ్‌లు అక్కడే వున్నారు. చిరు, చరణ్‌లు వారిని సరాండోస్‌కు పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్‌ను శాసిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌కు భారత్ కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడ అమెజాన్, డిస్నీ హాట్ స్టార్‌లు సింహభాగం ఆక్రమించగా.. ఇతర చిన్నా చితకా ఓటీటీలు ఎన్నో వున్నాయి. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ వ్యూహాలు ఇక్కడ వర్కవుట్ కావడం లేదు. అయితే భారత్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని సంస్థ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా సినిమాలు, ఒరిజినల్ కంటెంట్‌పై ఫోకస్ పెట్టింది. అలాగే రానున్న రోజుల్లో ఆఫర్స్ కూడా ఇచ్చే అవకాశం వుంది. ఇలాంటి పరిస్ధితుల్లో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భారత్‌కు రావడం అందులోనూ చిరంజీవి కుటుంబాన్ని కలవడం సినీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో చేస్తున్న ‘‘గేమ్ ఛేంజర్’’ దాదాపు 80 శాతం పూర్తయ్యింది. అటు చిరంజీవి సైతం దూకుడు పెంచారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ సోషల్ ఫాంటసీ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ . దీనికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో వుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More News

KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చికిత్స..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లోని బాత్‌రూమ్‌లో కాలు జారిపడ్డారు.

Ayyanna Patrudu: లోకేష్‌కు సొంత పార్టీలోనే తీవ్ర అవమానం.. అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు..!

తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీలో యువనేత నారా లోకేష్ పెత్తనంపై సీనియర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Telangana Ministers: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. హోంమంత్రి ఎవరంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు.

Daggubati Abhiram:ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్.. ఫొటోలు వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు.

Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ముందుగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.