‘నేసమణి’ వ్యవహారం: ప్లీజ్ నా జీవితం నాశనం చేయొద్దు!

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

గత కొన్ని రోజులుగా #Prayfornesamani హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ హ్యాష్ ట్యాగ్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఎడాపెడా వాడేశారు. అంతేకాదు ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని సైతం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి వార్తల్లో తమిళ టాప్ కమెడియన్ వడివేలు నిలిచాడు. దీంతో ఈ వ్యవహారంపై ఎట్టకేలకు ఆయన రియాక్ట్ అయ్యారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమిళ నిర్మాతల సంఘం తన కెరీర్‌ను నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. తనకు సినిమాలు దక్కకుండా చేసి కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటోందని తీవ్ర భావోద్వేగంతో ఆయన మాట్లాడారు.

దేశమంతా చర్చించారు!

‘ఇంసై అరసన్ 24 ఏఎం పులికేసి’ సినిమా గురించి ప్రస్తావించిన ఆయన.. ఈసినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నానని.. తన ప్రమేయం లేకుండా వారు ఈ సినిమాను కంప్లీట్ చేయలేరన్నారు. వారు తనకు స్వేచ్ఛగా యాక్టింగ్‌ను రాబట్టుకోవడం లేదన్నారు. మే 30న ‘నేసమణి’ పాత్ర ట్రెండ్ అయిందని.. దాని గురించి దేశం మొత్తం దాని గురించే చర్చించుకున్నారని వడివేలు చెప్పుకొచ్చారు. నేసమణి గురించి అందరూ మాట్లాడుకోవడదానికి కారణం ఆ దర్శకుడు తనకు స్వేచ్ఛ ఇవ్వడంతో ఆ క్యారెక్టర్ అంతా బాగా పండిందని చెప్పుకొచ్చారు. సో.. ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందో.. మున్ముంథు మరింత ముదురుతుందో వేచి చూడాల్సిందే మరి.