నెపోటిజం బాలీవుడ్లో చాలా ఎక్కువ: సమీరారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రాల ద్వారా తెలుగు చిత్రసీమలో తనకంటూ మంచి నటిగా ముద్ర వేయించుకున్న హీరోయిన్ సమీరారెడ్డి. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఇంటర్య్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. అలాగే.. ప్రస్తుతం బాలీవుడ్లో సంచలనం రేపుతున్న నెపోటిజం అనే అంశంపై కూడా సమీరా రెడ్డి స్పందించింది.
తాను ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు.. మొదట ఇచ్చిన స్క్రిప్ట్‌ను మార్చి ముద్దు సన్నివేశం పెట్టారని సమీరా రెడ్డి వెల్లడించింది. తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆ సన్నివేశం లేదని.. కాబట్టి తాను చేయనని చెప్పానని తెలిపింది. అప్పుడు తాను చేయాల్సిందేనని లేదంటే వేరే వాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వాళ్లు హెచ్చరించారని సమీరారెడ్డి వెల్లడించింది. ఆ సమయంలో తాను అలాంటి వారి నుంచి తప్పించుకోవడం చాలా పెద్ద టాస్క్‌గా మారిందని తెలిపింది.
క్యాస్టింగ్ కౌచ్ బారి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో సినిమాలను వదిలేసుకున్నానని సమీరారెడ్డి వెల్లడించింది. షూటింగ్‌ల అనంతరం జరిగే పార్టీ కల్చర్‌కు అలవాటు పడితే తనకు మరెన్నో సినిమా అవకాశాలు వస్తాయని తనకు తెలుసని.. కానీ వద్దనుకున్నానని తెలిపింది. బాలీవుడ్ గురించి సమీరారెడ్డి మాట్లాడుతూ.. బాలీవుడ్లో తాను అగ్రిమెంట్ చేసిన సినిమా నిర్మాత ఆ పాత్రకు తాను సరిపోనని వెల్లడించారన్నారు. ఓ స్టార్ కుమార్తెకు ఆ పాత్ర ఇచ్చేందుకే అలా తనకు చెప్పారని తర్వాత తెలిసిందని.. బాలీవుడ్లో నెపోటిజం చాలా ఎక్కువని సమీరా తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com