నేపాల్‌లో భారతీయ పేమెంట్స్ సిస్టమ్.. ప్రారంభమైన ‘యూపీఐ’ సేవలు
Send us your feedback to audioarticles@vaarta.com
నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా డబ్బుతో పని లేకుండా స్మార్ట్‌ఫోన్, చిన్న క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిగిపోతుండటంతో ప్రజలు కూడా దీనికి బాగా అలవాటు పడ్డారు. పనిలో పనిగా డిజిటల్ పేమెంట్స్ లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. యూపీఐ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 8.27 లక్షల కోట్ల విలువైన 452.75 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
భారత్‌లో రోజుకి ఒక బిలియన్ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నివేదిక తెలిపింది. యూపీఐ చెల్లింపులు ప్రజలు భారీగా వినియోగిస్తున్నందున దానికి తగినట్లుగానే బ్యాంకులు తమ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి పలు సదుపాయాల్లో మార్పులు చేసుకోవాల్సి అవసరం వుంది. దీనికోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో బ్యాంకులపై తీవ్ర భారం పడే అవకాశాలున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఎన్‌పీసీఐ యూపీఐ లైట్ యాప్‌ను తీసుకొస్తోంది. ఈ యూపీఐ లైట్ యాప్‌లో ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు.
మరోవైపు.. భారత్ అభివృద్ధి చేసిన యూపీఐపై పలు దేశాలు మనసు పారేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశమైన నేపాల్‌లోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. డిజిటల్ చెల్లింపుల కోసం భారత్ అభివృద్ధి చేసిన ఈ పేమెంట్స్ సేవలను నేపాల్ ప్రారంభించిందని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం భారత్ అభివృద్ధి చేసిన కొవిన్ యాప్‌ను సైతం అనేక దేశాలు ప్రశంసించాయని తెలిపింది. 2016లో ప్రారంభమైన యూపీఐ సేవలను మన పక్కన మరో దేశం భూటాన్ కూడా ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout