డబ్బింగ్, ఎడిటింగ్ పూర్తి చేసుకున్న'నేను సీతాదేవి'
Send us your feedback to audioarticles@vaarta.com
కీ.శే. శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందీప్, భవ్యశీ, రణధీర్, కోమలి తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం 'నేను సీతాదేవి'. ఇటీవలే ఆడియో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో, నిర్మాత అయిన సందీప్ మాట్లాడుతూ..ఇటీవల చైతన్యగారి సంగీత సారథ్యంలో విడుదలైన ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మా ఆడియో ఫంక్షన్‌కి విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్. రాజు గారికి, మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పాటలు బాగున్నాయని అన్ని ఏరియాల నుండి ఫోన్ చేసి చెబుతుంటే చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు శ్రీనివాస్ మల్లం చిత్రీకరణ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా నాకు, రణధీర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మా చిత్రం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.
జీవా, వెన్నెల కిషోర్, గుండు హనుమంతరావు, చిత్రం శ్రీను, ధనరాజ్, అంబటి శ్రీను, విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సన్నీ కోమలపాల్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్: సునీల్ కశ్యప్, సంగీతం: చైతన్య రాజా, నిర్మాత: చిటుకుల సందీప్, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com