'నేను శైలజ' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,January 01 2016]

సమర్పణ: కష్ణ చైతన్య

బ్యానర్: శ్రీ స‌్ర‌వంతి మూవీస్‌

న‌టీన‌టులు: రామ్, కీర్తి సురేశ్, సత్యరాజ్ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కష్ణచైతన్య, ప్రదీప్ రావత్, నరేష్, ధన్యా బాలకష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,

ఎడిటింగ్‌: ఎ. శ్రీకర్ ప్రసాద్,

కెమెరా: సమీర్ రెడ్డి,

ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్,

ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్,

నిర్మాత: స్రవంతి రవికిశోర్,

రచన-దర్శకత్వం: కిశోర్ తిరుమల

కందిరీగ' తర్వాత రామ్ కు సరైన హిట్ లేదు. మధ్యలో పండగచేస్తోతో పర్వాలేదనిపించినా సరైన కమర్షియల్ హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు. అలాటి హిట్ కోసం చేసిన చిత్రమే నేను..శైలజ'. హీరో హీరోయిన్ ను ప్రేమించడం, మధ్యలో హీరో తండ్రి కారణంగా వెళ్ళిపోవడం. హీరో, హీరోయిన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కన్విన్స్ చేసి హీరోయిన్ ను దక్కించుకోవడం. కానీ ఇదే కాన్సెప్ట్ ను దర్శకుడు కిషోర్ తిరుమల డ్రైవ్ చేసిన తీరు నిజంగా చాలా బావుంది. మంచి ఫీల్ నిచ్చింది. మరి అసలు కథ కమామీషులోకి వెళితే....

కథ

హరి(రామ్), చిన్నప్పుడే తన పక్కింట్లో ఉండే శైలజ(కీర్తి సురేష్)ను ఇష్టపడతాడు. అయితే శైలజ తండ్రి (సత్యరాజ్) చేసే చిన్న పనులు వల్ల అతనంటే ఇష్టపడదు. అలాంటి సందర్భంలో హరి అండ్ ఫ్యామిలీ వైజాగ్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. వైజాగ్ లో పెరిగే పెద్దయ్యే హరి తనకు నచ్చిన ప్రతి అమ్మాయితో ఐ లవ్ యూ చెబుతాడు. అయితే అందరూ ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. ఓ రోజు వైజాగ్ బీచ్ లో శైలజ కనపడుతుంది. వారి మధ్య పరిచయం పెరుగుతుంది. హరి తన ప్రేమను చెబుతాడు. అయితే శైలజ ఐ లవ్ యూ బట్ ఐ యామ్ నాట్ లవ్ విత్ యు అనేసి వెళ్ళిపోతుంది. అసలు ఎందుకలా అంటుంది. అప్పుడు హరి ఏం చేస్తాడు? తన తండ్రికి శైలజ ఎలా దగ్గరవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్

రామ్ చాలా ఎనర్జిటిక్ గా నటించాడు అని కాకుండా సన్నివేశానికి తగిన విధంగా చేసుకుంటూ పోయాడు. ఎక్కడా ఓవర్ చేసినట్టు కనపించదు. డైరెక్టర్ ను ఫాలో అయ్యాడు. ఒళ్ళుమరి వొంగదీయకుండా డ్యాన్సులు కూడా చాలా సింపుల్ గా చేశాడు. కీర్తి సురేష్ తన పాత్రకు న్యాయం చేసింది. ప్రదీప్ రావత్ చిన్న పాత్ర చేసిన కామెడి పంచే పాత్రలో కనిపిస్తాడు. సత్యరాజ్ తండ్రిగా పాత్రలో ఒదిగిపోయాడు. తల్లి పాత్రలో రోహిణి సూపర్ గా చేసింది. ప్రగతి కూడా తన పాత్రకు న్యాయం చేసింది. విజయ్ కుమార్, నరేష్, ప్రిన్స్ సహా పాత్రలన్నీ తమ పాత్రలు మేర నటించాయి. దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన కథను చెప్పినప్పటికి, చెప్పిన విధానం బావుంది. స్వతహాగా రైటర్ కావడంతో డైలాగ్స్ ను సింపుల్ గా చక్కగా రాసుకున్నాడు. వైజాగ్ బీచ్ పెద్దగా కనపడుతుంది,గట్టిగా వినపడుతుంది. లవ్ మాత్రం హుదూద్ అంటూ స్టార్టింగ్ లో వచ్చే డైలాగ్., నీ వల్ల కలిగే ఏ ఫీలింగ్ అయినా నాకు బావుంటుంది అని హీరో, హీరోయిన్ తో చెప్పే డైలాగ్, ఆడపిల్ల పుడితే అత్తారింటికి పంపేయాలని ఎవడు రాశాడో కానీ వాడికి కచ్చితంగా కూతురు ఉండి ఉండదని సత్యరాజ్ చెప్పే డైలాగ్, ప్రేమించి ఉంటే వదిలేసే దాన్ని కానీ వాడు అలవాటు అయిపోయాడని హీరోయిన్ తన తండ్రికి చెప్పే డైలాగ్, బ్రహ్మ దేవుడికంటే ముందే పుట్టినట్టున్నావ్ నేను నీకు బాబాయ్ ఏంట్రా అని చిన్నపిల్లాడు ప్రదీప్ రావత్ పై వేసే చిన్న పంచ్ ప్రేక్షకులకు స్మైల్ తెప్పిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బావుంది. పాటలతో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతి సీన్ ఫ్రెష్ గా కనపడుతుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్స్

సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ పెద్ద మైనస్ గా కనపడుతుంది. ఎక్స్ ప్రెషన్స్ సంగతి పక్కన పెడితే లుక్ విషయంలో కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమా అంతా మనకు ముందుగానే తెలిసి పోయే కాన్సెప్ట్ కావడం.

విశ్లేషణ

హిట్ కోసం ఎదురుచూసిన రామ్ కి ఈ సినిమా చాలా మంచి ఉత్సాహానిస్తుందనడంలో సందేహం లేదు. సినిమా ఫస్టాఫ్ అంతా ఎంటర్ టనింగ్ వేలో కొత్తగా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా భారీగా లేకుండా సింపుల్ పంఛ్ లతో సాగిపోతుంది. కిషోర్ తిరుమల కథనం సినిమా బలమైంది. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాను అదనపు బలాలుగా నిలిచాయి. అలాగని ఎక్కడా రాని కథ అని చెప్పలేం కానీ బట్ కామన్ ఆడియెన్ కు నచ్చే సినిమా.

బాటమ్ లైన్: నేను.. శైలజ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

రేటింగ్: 3.25/5

English Version Review

More News

రాజమౌళి టైటిల్ తో విక్రమ్ సినిమా...

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

అఖిల్ చూపు ఆ సినిమా వైపు..

అక్కినేని అఖిల్ రెండవ సినిమా ఎవరితో ఉంటుంది..?ఎలాంటి సినిమా చేస్తారనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది.

సాయిథరమ్ తేజ్ సుప్రీమ్ టీజర్ రివ్యూ..

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

అబ్బాయితో అమ్మాయి మూవీ రివ్యూ

ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను ముడుపెడుతూ వచ్చిన సినిమాల్లో కొన్నే మనసుకు హత్తుకుంటాయి. నాగశౌర్య, పల్లాక్ లల్వాని నటించిన అటువంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అబ్బాయితో అమ్మాయి.

'గరం' పాటలకు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్

సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ,ముందుకు దూసుకెళుతున్న ఆది ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నింటికన్నా చేసిన పూర్తి భిన్నమైన చిత్రం 'గరం'.