ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ నేను..శైలజ - సక్సెస్ మీట్ స్రవంతి రవి కిషోర్

  • IndiaGlitz, [Monday,January 04 2016]

రామ్, కీర్తి సురేష్ జంట‌గా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్రం నేను..శైల‌జ‌. ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ లో స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించారు. నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజైన నేను..శైల‌జ హిట్ టాక్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో ....

హీరో రామ్ మాట్లాడుతూ...నేను న‌టించిన దేవ‌దాసు సినిమా మిన‌హా మేజ‌ర్ హిట్స్ అన్నీ కామెడీ సినిమాలే. గ‌ణేష్ సినిమాలో సాఫ్ట్ రోల్ చేసాను. కానీ ఆశించిన రిజ‌ల్ట్ రాలేదు. దాంతో మాస్ సినిమాలు చేయాల‌ని ఫిక్స్ అయి కందిరీగ చేసాను. అది పెద్ద హిట్ అయ్యింది. ఫ‌స్ట్ టైం మాస్ ఎలిమెంట్స్ ప‌క్క‌న‌పెట్టి క్యూట్ ల‌వ్ స్టోరీ నేను..శైల‌జ చేసాను. ఈ సినిమాలో నేను కొత్త‌గా క‌నిపించాల‌ని పూర్తి బాధ్య‌త ద‌ర్శ‌కుడికే ఇచ్చాను. డైరెక్ట‌ర్ కిషోర్ ఎంతో కేర్ తో ఈ సినిమా చేసారు. కిషోర్ క‌థ చెబుతున్న‌ప్పుడు చాలా పాయింట్స్ నాకు రిలేటెడ్ గా అనిపించాయి. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సినిమాని ఆద‌రించి పెద్ద విజ‌యాన్ని అందించిన ఆడియోన్స్ థాంక్స్ అన్నారు.

నిర్మాత స్ర‌వంతి ర‌వి కిషోర్ మాట్లాడుతూ...నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్ర‌తి ఒక్క‌రికి క‌నెక్ట్ అయ్యే క‌థ ఇది. సెన్సిటివ్ పాయింట్ కి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్ట‌ర్ కిషోర్ ప్ర‌జెంట్ చేసిన విధానం నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమాకి స‌క్సెస్ అందించిన ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ...ఇదొక సినిమాల కాకుండా రియ‌లిస్టిక్ గా ఉండాల‌ని ఎంతో జాగ్ర‌త్త‌తో ఈ సినిమాని తీసాం. మా క‌థ‌ను ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ...డైరెక్ట‌ర్ ని కాకుండా కంటెంట్ ని న‌మ్మి సినిమా తీస్తే ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో ఈ సినిమా నిరూపించింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తునే ఉన్నారు. ఈ సినిమాని కూడా ఆద‌రిస్తున్నారు అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ మ‌ల‌చిన విధానం ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ క‌నిపించ‌లేదు. హ‌రి అనే క్యారెక్ట‌ర్ మాత్ర‌మే క‌నిపించింది. స్ర‌వంతి మూవీస్ లో ఎప్పుడూ మంచి చిత్రాలే వ‌స్తాయి. ఈ సంస్థ మ‌రిన్ని మంచి సినిమాలు అందించాలి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చైత‌న్య‌క్రిష్ణ‌, స‌మీర్ రెడ్డి, భాస్క‌ర‌భ‌ట్ల ర‌వి కుమార్, అనంత శ్రీరామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.