నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'
Send us your feedback to audioarticles@vaarta.com
కె.ఎన్.రావ్ సమర్పణలో శాస్టా మీడియాస్, దత్తాత్రేయ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శేఖర్, సుష్మ, డయానా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నేను..నా ప్రేమకథ. వర్ధన్ దర్శకత్వంలో వర్మ, పణుకు రమేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా నవంబర్ 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ `గుడ్ లవ్ స్టోరి. దర్శకుడు వర్ధన్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. శేఖర్, సుష్మ, డయానాలు చక్కగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. చిన్ని చరణ్, ఎం.ఎస్.మిథున్లు సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్యూర్ లవ్‌స్టోరి. లవ్‌తో పాటు అన్నీ రకాల ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ 27న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
ఎమ్మెస్ నారాయణ, అంబటి శీను, నవీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరాః నగేష్ ఆచార్య, డ్యాన్స్ః విద్యాసాగర్, కిరణ్, నిర్మాతలుః వర్మ, పణుకు రమేష్ బాబు, దర్శకత్వం: వర్ధన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com