Nenu Meeku Baaga Kavalsinavaadini: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రం నుండి "చాలాబాగుందే" లిరికల్ సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్ హీరోగా ఇప్పుడు "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి "చాలా బాగుందే" అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట వింటుంటే ఇది మెలోడీ సాంగ్ అని అర్ధమవుతుంది.
అలానే ఈ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది.కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా, ఈ నెల 16న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout