Nenu Meeku Baaga Kavalsinavaadini: సెప్టెంబర్ 9న 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణ మండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ నెంబర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో..
నీకు చెమటలు పట్టించుకోని పోను మామో..
నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో..
నీ కండలు కరిగించి కానీ పోను మామో..
అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
పాటలో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోని 'చిలకపచ్చ కోక', అలాగే అన్నయ్య సినిమాలోని 'ఆట కావాలా పాట కావాలా' పాటలకు కూడా డాన్స్ చేసి మెప్పించారు కిరణ్ అబ్బవరం. ఇది ఈ మాస్ నెంబర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు. సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత, నిహరిక, ప్రమోదిని, భరత్ రొంగలి తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments