నాని - కీర్తి సురేష్ జంటగా నేను లోకల్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ చిత్రం ఈరోజు ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్విచ్చాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...సినిమా చూపిస్త మావ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసి నేను కొన్ని సలహాలు ఇచ్చాను. ఆతర్వాత ఆ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే. అప్పటి నుంచి డైరెక్టర్ త్రినాధరావు, రైటర్ ప్రసన్న తో పరిచయం ఉంది. ఆతర్వాత త్రినాధ్, ప్రసన్న ఈకథ గురించి ఓ ఐడియా చెప్పారు. విన్న వెంటనే నాకు బాగా నచ్చింది. ఆర్య, ఇడియట్ తరహాలో ఉండే డిఫరెంట్ లవ్ స్టోరీ. నాని కూడా కథ విన్న వెంటనే ఓకే చెప్పాడు.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. నేను శైలజ తర్వాత కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా సంవత్సరాల తర్వాత మంచి టీమ్ సెట్ అయ్యింది. కథ విన్నప్పుడు మేము ఎలాగైతే ఎగ్జైట్ అయ్యామో సినిమా చూసిన తర్వాత ఆడియోన్స్ కూడా అలాగే ఫీలవుతారు. ఈనెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ...దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేయాలి. నానితో, దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేయాలి అనుకున్నాను. ఈ కోరికలన్నీ ఈ ఒక్క సినిమాతోనే నెరవేరుతుండడం చాలా ఆనందంగా ఉంది. లోకల్ లో ఉండే అబ్బాయి నాన్ లోకల్ అమ్మాయిని ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తాడు అనేదే నేను లోకల్ కాన్సెప్ట్. ఈ చిత్రంలో నవీన్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. నాని మన పక్కింటి అబ్బాయిలా ఉంటే...కీర్తి మన ఇంట్లో అమ్మాయిలా ఉంటుంది. వీరిద్దరి కలిసి నటిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రసన్న డైలాగ్స్ ఆడియోన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి అన్నారు.
రైటర్ ప్రసన్న మాట్లాడుతూ...నానితో గత 7 సంవత్సరాలుగా పరిచయం వుంది. దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేస్తుండడం మరచిపోలేని అనుభూతి. గత సంవత్సరం ఆగష్టు 14న సినిమా చూపిస్త మావ సినిమా రిలీజైంది. ఈ సంవత్సరం ఆగష్టు 14కి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుండడం సంతోషంగా ఉంది అన్నారు.
హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ...నేను శైలజ - నేను లోకల్ నా సినిమా టైటిల్స్ రెండింటి సౌండింగ్ ఒకేలా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర మన పక్కంటి అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దిల్ రాజు గారి బ్యానర్ లో నానితో వర్క్ చేస్తుండడం హ్యాపీ ఉంది అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాను. నాని నన్ను ఎంతగానో ప్రొత్సహించేవాడు. 100% నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దిల్ రాజు గార్కి, త్రినాథరావు గార్కి థ్యాంక్స్ అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ...కథ విన్నప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేసాను. కథ విన్నప్పుడే ఇంత బాగా ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేయాలి అని నాలుగైదు సార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పటికీ కుదిరింది. ఇంత ఎంటర్ టైన్మెంట్ ఉన్న స్ర్కిప్ట్ ని డైరెక్టర్ త్రినాథ్ ఇంకెంత బాగా తెరకెక్కించగలడో నేను ఊహించుకోగలను. నవీన్ చంద్ర క్యారెక్టర్ హీరోకి సమానంగా ఉండే పవర్ ఫుల్ రోల్. ఇక కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే...నేను శైలజ సినిమా చూడలేదు కానీ...కీర్తి సురేష్ నటించిన తమిళ్ మూవీ చూసాను. పాత్రకు తగ్గట్టు బాగా నటించే కీర్తితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com