'నేను లోకల్' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌', 'జెంటిల్ మ‌న్‌', మ‌జ్ను'..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నేను లోక‌ల్‌'."ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌...క్యాప్ష‌న్‌.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల గురించి ....

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ - ''నేను లోక‌ల్ చిత్రంలో సరికొత్త నానిని చూస్తారు. డైరెక్ట‌ర్ త్రినాథ్ త‌న‌దైన స్టైల్ల్లో, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్‌తో రూపొందిస్తున్న ల‌వ్ స్టోరి ఇది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం కాకినాడ‌లో జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది'' అన్నారు.

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్,

More News

ఖైదీ నెం 150 ఫస్ట డే గ్రాస్ 47 కోట్ల 7 లక్షలు - అల్లు అరవింద్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కించిన ఖైదీ నెం 150 ప్రపంచ వ్యాప్తంగా నిన్న రిలీజైంది.

పవన్ టీజర్ డేట్ మారింది...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాత గా డాలీ దర్శకత్వంలో

శాతకర్ణి విజయం మరింత బాధ్యత పెంచింది - బాలకృష్ణ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

శతమానం భవతి కొత్త కథ కాదు కానీ....అది మాత్రం గ్యారెంటీ - శర్వానంద్..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా....ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శర్వానంద్.

నాగార్జున మ‌రో భ‌క్తిర‌స చిత్రం..!

అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాల త‌ర్వాత న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున న‌టించిన మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు.