జూలై 12 న విడుదల కానున్న 'నేను లేను'..!!

  • IndiaGlitz, [Wednesday,July 03 2019]

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రలుగా ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి నిర్మిస్తున్న చిత్రం 'నేను లేను'... 'లాస్ట్ ఇన్ లవ్' అనేది ఉప‌శీర్షిక‌.. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ ను అందుకుని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యి యు/ఎ సర్టిఫికేట్ పొందగా జులై 12న ఈ సినిమా ని విడుదల అవుతుంది..

ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ - ఈ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 12 న రిలీజ్ కాబోతుంది.. ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది.. ఆద్యంత ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తుంది.. ఈ సినిమా ట్రైలర్ ని కోటి మంది చూశారు.. ట్రైలర్ లాగే సినిమా కూడా అందరిని ఆకట్టుకుంటుంది.. . ప్రేక్షకులు తప్పకుండా తప్పకుండా చూడండి.. అన్నారు..

నిర్మాత సుక్రి మాట్లాడుతూ... ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. ‌కోటి మంది ఈ ట్రైలర్ ని చూశారంటే మా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం తప్పక ఉంది.. జూలై 12 న ఈ సినిమా ని విడుదల చేస్తున్నాం.. ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఇది..అందరిని తప్పకుండా అలరిస్తుంది.. అన్నారు..

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయి స‌తీష్ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, స‌హ‌నిర్మాత : య‌షిక, నిర్మాత : సుక్రి , రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.

More News

త్వ‌ర‌లో సాహో లో "psycho saiyaan" లిరిక్ తో సాగే సాంగ్

'బాహుబలి' 1, 2 తరువాత  ప్ర‌పంచం లో వున్న ప్ర‌తి ఓక్క‌రి చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది.

'కల్కి' వంటి మాస్‌ కమర్షియల్‌ చిత్రం ద్వారా కథ రచయితగా పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది - కథ రచయిత సాయితేజ్ దేశరాజ్

యాంగ్రిస్టార్‌ డా. రాజశేఖర్‌ లాంటి కమర్షియల్‌ హీరోకి 'కల్కి' కథ చెప్పి సింగిల్‌ నేరేషన్‌లోనే ఆయన్ని మెప్పించి ఇండస్ట్రీ ద ష్టిని తన వైపు తిప్పుకున్నారు రైటర్‌ సాయి తేజ్ దేశరాజ్.

వంగ‌వీటి లుక్ లో సురేష్ కొండేటి

ఒక కులం అండ‌తో నాయ‌కుడైనా ..  ప్ర‌త్య‌ర్థి సామాజిక వ‌ర్గం యువ‌తిని పెళ్లాడి.. ప్ర‌త్య‌ర్థి కులాల పేద‌ల్ని ఆదుకుని..

ప‌దిహేను కిలోలు త‌గ్గిన లేడీ క‌మెడియ‌న్‌

విద్యుల్లేఖా రామ‌న్‌.. త‌మిళ న‌టి. సీనియ‌ర్ త‌మిళ నటుడు మోహ‌న్ రామ‌న్ కుమార్తెగా ఇండ‌స్ట్రీకి ప‌రిచంయ అయ్యారు.

రోశయ్య ఆవిష్కరించిన 'పోలీస్ పటాస్' ట్రైలర్

ఆయేషా హబీబ్ ,రవికాలే ప్రధాన పాత్రలో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పోలీస్ పటాస్".