నేను కిడ్నాప్ అయ్యాను అక్టోబర్ 6 విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది . ఈ చిత్ర నిర్మాతలు అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నారు. భ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం మేజర్ హైలైట్ గా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదం అందిస్తుంది. దర్శకుడు శ్రీకరా బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు
ఈ సందర్భంగా నిర్మాత మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ "మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసారు. మా టీం అందరిని బాగా మెచ్చుకున్నారు. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకరా బాబు సినిమాని చాల బాగా చిత్రీకరించారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ లా కామెడీ తోపాటు రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం చాల బాగుంది నటించిన స్కీన్లు చాల బాగా వచ్చాయి. అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నాము ".
దర్శకుడు శ్రీకరా బాబు మాట్లాడుతూ " అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం చాల సంతోషం గాఉంది. నిర్మాత కంప్రమైస్ కాకుండా సినిమా కి ఎంత కావాలో ఎంత ఖర్చుపెట్టారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. బ్రహ్మానందం పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం మేజర్ హైలైట్ గా ఉంటుంది. అక్టోబర్ 6 న సినిమా ని విడుదల చేస్తాము." అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments