'నేను కిడ్నాప్ అయ్యాను' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Friday,August 04 2017]

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, 'కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో' దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చూసారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తాగుబోతు రమేష్ హాస్య సన్నివేశాలకి బాగా నవ్వి దర్శకుడు శ్రీకర్ బాబుని మరియు నిర్మాత మాధవి అదంకి మంచి సినిమా చూపించారు అని మెచ్చుకున్నారు. ఇలాంటి మంచి హాస్యచిత్రాలు కుటుంబసభ్యులు అందరు చూడాలి అని మా ఈ 'నేను కిడ్నప్ అయ్యాను' చిత్రానికి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఆగష్టు రెండో వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ " మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసారు. మా టీం అందరిని బాగా మెచ్చుకున్నారు. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకర్ బాబు సినిమాని చాల బాగా చిత్రీకరించారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ లా కామెడీ తోపాటు రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం చాల బాగుంది నటించిన స్కీన్లు చాల బాగా వచ్చాయి. ఆగష్టు రెండో వారం లో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ".
దర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ " అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యుల మాటలు నాకు చాల సంతోషాన్ని కలిగించాయి . క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం చాల సంతోషం గాఉంది. నిర్మాత కంప్రమైస్ కాకుండా సినిమా కి ఎంత కావాలో ఎంత ఖర్చుపెట్టారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. బ్రహ్మానందం పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం మేజర్ హైలైట్ గా ఉంటుంది. ఆగష్టు రెండో వారం లో సినిమా ని విడుదల చేస్తాము." అన్నారు.