Nenorakam Review
పూరి లాంటి స్టార్ డైరెక్టర్ అన్నయ్య అయినా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో సాయిరాం శంకర్. తన ప్రయత్నాలు మానకుండా సాయిరాం శంకర్ చేసిన మరో ప్రయత్నమే నేనో రకం. తమిళ స్టార్ హీరో శరత్‌కుమార్ కీలక పాత్రలో సుదర్శన్ సలేంద్ర అనే కొత్త దర్శకుడితో కలిసి చేసిన ప్రయత్నం నేనో రకం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..
కథ:
సిటీలో కొంతమందికి ఓ ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్నవాళ్లు, తీసుకోని వాళ్ళు పనిష్‌మెంట్‌కు గురవుతారు. ఇలాంటి తరుణంలో అనాథ అయిన గౌతమ్(సాయిరాం శంకర్), తన ఫ్రెండ్ గిరితో థియేటర్ వద్ద ఉన్నప్పుడు స్వేచ్చను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలుచుకోవడానికి ఆమెకు అబద్ధం చెప్పి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ముందు గౌతమ్ అబద్ధాన్ని తప్పుగా అర్థం చేసుకున్న స్వేచ్చ. గౌతమ్ ప్రేమన అర్థం చేసుకుని ప్రేమిస్తుంది. తన ప్రేమను చెప్పడానికి గౌతమ్‌ను ఓ కాఫీ హోటల్‌కు రమ్మంటుంది. గౌతమ్ చూస్తుండగానే కొందరు స్వేచ్చను కాఫీ షాప్ దగ్గర కిడ్నాప్ చేస్తారు. తాము చెప్పిన పనిచేయకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు కిడ్నాపర్(శరత్‌కుమార్). కిడ్నాపర్ చెప్పినదల్లా చేస్తుంటాడు గౌతమ్. చివరకు గౌతమ్‌ను కిడ్నాపర్ ఓ హత్య చేయమంటాడు. గౌతమ్ హత్య చేస్తాడా? ఇంతకు కిడ్నాపర్ ఎవరు? గౌతమ్‌కు, స్వేచ్చరకు, కిడ్నాపర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? అనే సంగతులను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- నటీనటులు పనితీరు
- సెకండాఫ్
- సినిమాటోగ్రఫీ
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- ఫస్టాఫ్
- రొమాంటిక్, కామెడి పార్ట్
సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే సాయిరాం శంకర్ సీన్ ఫ్రారంభం నుండి ఫుల్ ఎనర్జితో తన పాత్రకు న్యాయం చేశాడు. డ్యాన్సులు, ఫైట్స్ పరంగా మెప్పించాడు. ఫస్టాఫ్‌లో ప్రేమను పొందాలనుకునే యువకుడిగా, సెకండాఫ్‌లో తన లవర్ కోసం రిస్క్ చేసే యువకుడిగా మెప్పించాడు. రేష్మీమీనన్ చూడటానికి అందంగా ఉంది. తన పాత్రకు న్యాయం చేసింది. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన ముఖ్య పాత్ర శరత్‌కుమార్. కిడ్నాపర్ పాత్రలో శరత్‌కుమార్ ఎంట్రీ తర్వాతే కథలో వేగం పెరుగుతుంది. శరత్‌కుమార్ తనదైన నటనతో పాత్రలో ఒదిగిపోవడం వల్ల సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎం.ఎస్.నారాయణ, వైవాహర్షల కామెడి పెద్దగా నవ్వించలేదు. ఈ కామెడితో సినిమాను సాగదీయడానికి దర్శకుడు ప్రయత్నించినట్లు కనపడుతుంది. కాదంబరి కిరణ్, కాశీవిశ్వనాథ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు సుదర్శన్ మంచి కథను అనుకుని ఆ కథను ఆసక్తికరంగా ముందుకు సాగించడంలో మంచి మార్కులనే కొట్టేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ వల్ల సినిమా ఆసక్తికరంగా అనిపించింది. ఇక మహిత్ నారాయణ సంగీతం కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ తన ఎడిటింగ్‌తో ఫస్టాఫ్‌లో మరికొన్ని సీన్స్ కట్ చేసుంటే బావుండేదనిపించింది. నిర్మాణ విలువవలు బావున్నాయి. మొత్తం మీద నేనోరకం సాయిరాం శంకర్‌కు తన గత చిత్రాలకంటే మంచి చిత్రంగానే చెప్పవచ్చు. సాయిరాం శంకర్ , శరత్‌కుమార్ నటన సినిమాకు మేజర్ ప్లస్.సినిమాలో చెప్పిన మెసేజ్ బావుంది.
బోటమ్ లైన్: నేనోరకం.. మెప్పించే కిడ్నాప్ డ్రామా
Nenorakam English Version Review
- Read in English