'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలిలో భళ్ళాలదేవగా అందిరినీ మెప్పించిన రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈరోజు రామానాయుడు జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆసక్తి రేపెలా ఉంది.
జైలులోకి గొలుసులతో ఎంట్రీ ఇచ్చిన రానా, నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేయాలి, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేయాలి అంటూ డైలాగ్ చెబుతాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో రానా కనపడతాడట. తెలుగు, తమిళంలో ఈ సినిమాను డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com