22న 'నేనే రాజు నేనే మంత్రి' తమిళ వెర్షన్

  • IndiaGlitz, [Friday,September 15 2017]

ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి.. మంచి విజ‌యం సాధించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. రానా, కాజ‌ల్‌, కేథ‌రిన్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్టు 11న విడుద‌లైన ఈ సినిమా.. అదే రోజు పోటీగా వ‌చ్చిన లై, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌ను త‌ట్టుకుని బాక్సాఫీస్ విజేత‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని త‌మిళంలోనూ అదే రోజున విడుద‌ల చేయాల‌నుకున్నారు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా త‌మిళ డ‌బ్బింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధ‌మైంది.

నాన్ ఆనైయిట్టాల్ పేరుతో విడుద‌ల కానున్న ఈ సినిమా త‌మిళంలోనూ లాభాలు మూట‌గ‌ట్టుకుంటుందేమో చూడాలి. బాహుబ‌లితో రానాకి పెరిగిన క్రేజ్‌.. కాజ‌ల్‌, కేథ‌రిన్ వంటి తెలిసిన ముఖాలు ఉండ‌డం అనే అంశాలు ఈ సినిమాకి ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించ‌డంలో ప్ల‌స్ అవుతాయ‌న‌డంలో సందేహం లేదు.

More News

అదోటైప్ అమ్మాయిల ప్రేమగాధ

గోపి వర్మ,మాళవిక మీనన్,శివాజీ రాజా ప్రధాన పాత్రధారులుగా గాయత్రి రీల్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం `అమ్మాయిలంతే..అదోటైపు`.

కేథరిన్ బాటలో రాశి ఖన్నా

ఆగస్టు 11,2017..ఈ తేది గ్లామర్ హీరోయిన్ కేథరిన్ ట్రెసాకి ప్రత్యేకం.ఎందుకంటే..

త‌మ‌న్నా పోస్ట‌ర్ అదుర్స్

న‌ట‌న కంటే న‌ర్త‌న విష‌యంలోనే ఎక్కువ మార్కులు కొట్టేసిన క‌థానాయిక త‌మ‌న్నా. అందుకే ఆమెకి అప్పుడ‌ప్పుడు ప్ర‌త్యేక గీతం చేయ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి.

అక్టోబర్ లో 'శేఖరం గారి అబ్బాయి'

ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకం పై అచ్చివర్స్ సిగ్నేచర్ బ్యానర్ లో హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు,

ప్రతిక్షణం మలుపులతో శ్రీవల్లి కొత్త అనుభూతినిస్తుంది: రాజ్ కుమార్

కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం.