22న 'నేనే రాజు నేనే మంత్రి' తమిళ వెర్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. మంచి విజయం సాధించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. రానా, కాజల్, కేథరిన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా.. అదే రోజు పోటీగా వచ్చిన లై, జయజానకి నాయక చిత్రాలను తట్టుకుని బాక్సాఫీస్ విజేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని తమిళంలోనూ అదే రోజున విడుదల చేయాలనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తమిళ డబ్బింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది.
నాన్ ఆనైయిట్టాల్ పేరుతో విడుదల కానున్న ఈ సినిమా తమిళంలోనూ లాభాలు మూటగట్టుకుంటుందేమో చూడాలి. బాహుబలితో రానాకి పెరిగిన క్రేజ్.. కాజల్, కేథరిన్ వంటి తెలిసిన ముఖాలు ఉండడం అనే అంశాలు ఈ సినిమాకి ప్రేక్షకులను రప్పించడంలో ప్లస్ అవుతాయనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com