ఈ నెల 8న వస్తోన్న 'నేనే ముఖ్యమంత్రి'!!
Send us your feedback to audioarticles@vaarta.com
వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు , ఆలూరి సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నేనే ముఖ్యమంత్రి`. దేవిప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 8న గ్రాండ్ గా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా వైష్ణవి ఫిలింస్ అధినేత అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ...``మా చిత్రం ద్వారా సమకాలీన రాజకీయ అంశాల గురించి చర్చించాం. అన్ని వర్గాలకు నచ్చే అంశాలతో పాటు అందర్నీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. దేవిప్రసాద్, వాయుతనయ్, శశి, సుచిత్ర అద్భతమైన నటన ప్రదర్శించారు. సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రం. కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా నిర్మించాం. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం`` అన్నారు.
నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ...``నేటి సమాజం యొక్క రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ `నేనే ముఖ్యమంత్రి` చిత్రాన్ని నిర్మించాము. మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. మా దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎక్కడా ఇబ్బంది రాకుండా సినిమాను పూర్తి చేసారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం ``అన్నారు.
దేవిప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర, నళిని కాంత్, రామరాజు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః ఫణి కళ్యాన్, కెమెరాఃకమలాకర్, రచన సహకారంః హిరణ్మయి-సత్య జేబి, నిర్మాతలుః అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు; రచన-దర్శకత్వంః మోహన్ రావిపాటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com