వ్యవసాయం అంటే తెలియదు.. మీరు అగ్రికల్చర్ మినిస్టర్ : కాకాణిపై జనసేన నేత కిషోర్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం భరించలేకే తమ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా జనసేన నేత కిషోర్ గునుకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున పవన్ ఆదుకుంటున్నారని ప్రశంసించారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని ప్రగల్భాలొద్దని.. చేతనైతే ఈ మూడు వేల మందికి ప్రకటించిన రూ.7 లక్షలు నష్టపరిహారం ఇచ్చి మాట్లాడాలని కిషోర్ సవాల్ విసిరారు.
వ్యవసాయం అంటే మీకు తెలుసా? అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారని.. మరి 8 ఏళ్లుగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీకు రైతులుపడుతున్న ఇబ్బందులు గురించి తెలుసా అని కిశోర్ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారనే విషయం మీకు తెలుసా అని ఆయన నిలదీశారు. సర్వేపల్లిలో భూగర్భ జలాలు దోపిడికి గురవుతున్నాయని.. థర్మల్ ప్లాంట్ల పేరుతో నెల్లూరు జిల్లాను రేడియేషన్‌కు గురి చేస్తున్నారని మీకు తెలుసా అని కిశోర్ ప్రశ్నించారు.
దమ్ముంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతమంది రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించారో వివరాలు చెప్పగలరా అని ఆయన నిలదీశారు. రైతుల కష్టాలు తెలియని కాకాణి గోవర్ధన్ రెడ్డి.. రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే వాళ్లకు ఆర్ధిక భరోసా కల్పించడానికి పవన్ నేరుగా వెళ్లి వాళ్ల కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నారని కిషోర్ ప్రశంసించారు. ఈ తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయట పడతాయనే భయంతో విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout