BiggBoss: కొత్త కెప్టెన్‌గా నెల్లూరు ఆదిరెడ్డి... ఇద్దరి కోసం జైలుకెళ్లిన అర్జున్

  • IndiaGlitz, [Saturday,September 24 2022]

అడవిలో ఆట టాస్క్ ముగియడంతో శ్రీహాన్, గీతూ, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. వీరిలో ఎవరు ఈ వారం కెప్టెన్ అవుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూస్తే.. షో మొదలవ్వగానే ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ‘ఎత్తర జెండా’ అనే ఈ టాస్క్‌లో ఇసుకని కాడికి ఓ వైపు వున్న ఖాళీ బాక్స్‌లో పోస్తే.. మరోవైపు పైకి లేస్తుంది. అందులో కెప్టెన్సీ పోటీదారుల జెండా వుంటుంది. ఎవరిదైతే మొదటగా పైకి లేస్తుందో వాళ్లే విన్నర్.

ఇందులో సత్యశ్రీ, శ్రీహాన్‌, ఆదిరెడ్డిలు తలపడ్డారు. అయితే ఆదిరెడ్డి ఆరున్నర అడుగుల కటౌట్ వుండటంతో పాటు స్వతహాగా రైతు బిడ్డ కావడంతో ఇసుకను అవలీలగా ఎత్తేశాడు. భారీకాయం కావడంతో మనోడు రెండు అడుగులు వేస్తే ఇసు తొట్టె దగ్గరకు అవలీలగా చేరుకునేవాడు. శ్రీహాన్ పోటిఇచ్చినప్పటికీ ఓడిపోయాడు. ఇక శ్రీసత్య ఆడపిల్ల కావడం ఇలాంటివి అలవాటు లేకపోవడంతో ఇసుకను మోయలేకపోయింది. చాలా సులభంగా కెప్టెన్ అయిన ఆదిరెడ్డి.. సింహాసనంలో కూర్చొన్నాడు. లవ్యూ కవితా అంటూ భార్యను తలచుకుని, నువ్వు హ్యాపీనా అని ఉద్వేగానికి గురయ్యాడు.

తర్వాత ప్రతిరోజూ ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ షోలో ఎవరు ఎక్కువసేపు కనిపిస్తారని చెప్పాలంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరిలో అత్యధికంగా దాదాపు పది నిమిషాల పాటు కంటెంట్ ఇస్తున్న గీతూకే ఇంటి సభ్యులు ఓటేశారు. పదినిమిషాల ట్యాగ్‌ను ఆమె మెడలో వేశారు. తర్వాత ఏడు నిమిషాల కంటెంట్ ఇస్తున్న వారిలో ఫైమా, రేవంత్ పోటీపడ్డారు. కానీ చివరికి రేవంత్‌తకే ట్యాగ్ దక్కింది. తర్వాత ఇనయా, శ్రీహాన్, వాసంతి, ఫైమా, చంటిలకు ఏదో ఒక ట్యాగ్ దక్కింది.

కానీ అర్జున్, ఆరోహి, కీర్తిలకు మాత్రం జీరో ట్యాగ్ వచ్చింది. అంటే వీళ్లు హౌస్‌లో కెమెరాలో కనిపించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్న మాట. అంతేకాదు.. వరస్ట్ కంటెస్టెంట్‌గా వీరిలో ఒకరు జైలుకి కూడా వెళ్లాలి. ఎవరు జైలుకి వెళ్లాలన్న దానిపై ముగ్గురు చర్చించుకుని అర్జున్‌ని జైలుకు పంపారు. ఇకపోతే.. ఈవారం ఎలిమినేట్ కాబోయేది తానేనని వాసంతి అందరికీ హింట్స్ ఇస్తోంది. ఇనయాతో నువ్వు, నేను, ఆరోహి డేంజర్‌ జోన్‌లో వున్నాం అని తెగ బాధపడుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఒక్క వారం ఉండి.. ఆ స్టేజ్ మీదికి వెళ్లినా లక్ అనే చెప్పాలి అని వాసంతి వ్యాఖ్యానించింది.

ఇక ఈరోజు అన్నిటికంటే హైలైట్ అయ్యారు ఆరోహి- సూర్య. అర్థరాత్రి పూట వీరి ముచ్చట్లు, కవ్వింపులు, సరసాలు చూస్తుంటే గత సీజన్‌లో షణ్ముఖ్- సిరిలను గుర్తుకు తెచ్చారు. కానీ వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ వుందో వారికే తెలియాలి. కాసేపు స్నేహితుల్లా, కాసేపు ప్రేమికుల్లా ప్రవర్తిస్తారు. రేపు శనివారం నాగార్జున వస్తుండటంతో ఎవరికి క్లాస్ పీకుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ వుంటుందా.. లేక ఒకరితోనే సరిపెడతారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

More News

GodFather: 'గాడ్ ఫాదర్' కు సెన్సార్ సర్టిఫికేట్, అక్టోబర్ 5న రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

'ది ఘోస్ట్' సెప్టెంబర్ 25న కర్నూలులో జరిగే  ప్రీ-రిలీజ్ కి హాజరుకానున్న నాగ చైతన్య, అఖిల్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'

'శాకుంతలం' నవంబర్ 4న విడుదల

ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.

BiggBoss: ‘‘పిట్ట’’ అంటూ కామెంట్.. ఇనయా- శ్రీహాన్‌ల గొడవతో దద్దరిల్లిన హౌస్

కెప్టెన్సీ కంటెండెర్స్ కోసం జరుగుతోన్న అడవిలో ఆట టాస్క్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

Geeta Sakshigaa: ప్రేక్షకులలలో క్యూరియాసిటీతో పాటు హైప్ పెంచిన "గీతా సాక్షిగా" టీజర్

PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్,