సౌత్ హీరోలపై నోరు పారేసుకున్న నేహా ధుపియా
Send us your feedback to audioarticles@vaarta.com
నేహా ధూపియా.. అందంతో పాటు వివాదాలతో సావాసం చేసే బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ లిస్టులో ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో సౌత్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మిస్ ఫెమినా ఇండియా 2002గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి.. సౌత్‌లో చేసిన సినిమాలు తక్కువే అయినా.. బాలీవుడ్‌లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో మాజీ క్రికెటర్ యువరాజ్‌తోనూ ఎఫైర్ నడిపిందంటుంటారు. గతేడాది ప్రముఖ మోడల్, నటుడు అంగద్ సింగ్ బేడీతో వివాహమైన తర్వాత టీవీ షోలకు పరిమితమైపోయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌లోనూ నటించి మెప్పించింది.
ఇదిలా ఉంటే.. నేహా ధూపియా.. డేరింగ్ డాషింగ్. మనసులో ఏం దాచుకోకుండా బోల్డ్‌గా మాట్లాడుతుంటుంది. వివాదాలకు కారణమవుతూ ఉంటుంది. తాజాగా దక్షిణాది హీరోలపై ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. సౌత్‌లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యమివ్వరని.. హీరోలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఆమె చెప్పుకు వచ్చింది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. చాలా ఏళ్ల క్రితం తాను ఓ దక్షిణాది సినిమాలో నటించినప్పుడు జరిగిన విషయాన్ని చెప్పింది. సినిమా షూటింగ్ సందర్భంగా నిర్మాతలు ముందుగా హీరోకే భోజనాన్ని ఏర్పాటు చేశారని.. ఆ సమయంలో తాను చాలా ఆకలిగా ఉన్నా.. మొదట హీరోకే భోజనం పెట్టారని తెలిపింది. ఇద్దరు ఉన్నప్పుడు.. కలిపి భోజనం పెట్టాలనే కనీస మర్యాదను వారు పాటించలేదని ఆరోపించింది. అయితే అది తనకు నవ్వు తెప్పించిందని చెప్పింది. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిందంటూ సౌత్ హీరోలపై నోరు పారేసుకుంది. ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘పరమవీర చక్ర’, ‘విలన్’ తదితర చిత్రాల్లో నటించిన నేహా.. ఏ సౌత్ హీరోను టార్గెట్ చేసిందా అన్న ఆలోచనల్లో నెటిజన్లు మునిగిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com