గౌతమీపుత్రశాతకర్ణి కోసం నీతూలుల్లా పరిశోధన

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి జార్జియా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

గౌతమిపుత్ర సినిమా కోసం నీతూ దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన చేశారు. అందుకోసం ఆవిడ చాల రీసెర్చ్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందని సంస్కృతి, సంప్రదాయాలను స్టడీ చేస్తున్నారు. అలాగే ఇండియాలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్ తో అభరణాలకు సంబంధించిన మోడల్స్ ను గీయించి అభరణాలను తయారుచేస్తున్నారు.

చాలా అన్వేషణ తర్వాత ప్రతి క్యారెక్టర్ కు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాను. అలాగే అమరావతి నగర నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాను. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానని నీతూ లుల్లా తెలియజేశారు.

చిత్ర నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి విజుల్ గ్రాండ్ గా ఉండాలని ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, శ్రేయ, హేమామాలిని వంటి ప్రధాన తారాగణం లుక్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

More News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న సెంటిమెంట్..

మనలో చాలా మంది సెంటిమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు.

పెళ్లి గురించి లావణ్య మనసులో మాట.....

సాధారణంగా హీరోయిన్ కనపడగానే ఎవరైనా అడిగే ప్రశ్న మీరు ప్రేమ పెళ్ళి చేసుకుంటారా?

చైతు క‌ళ్యాణం గురించి క‌ళ్యాణ్ కృష్ణ‌..

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

వినాయ‌క్ ని బాధ‌పెట్టిన చ‌ర‌ణ్

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ దర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...రామ్ చ‌ర‌ణ్ మాట వినాయ‌క్ ని బాధ‌పెట్టింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

అమెరికా నుంచి ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.