'నీతోనే హాయ్..హాయ్' చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
కెఎస్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా.ఎ.స్. కీర్తి, డా.జి.పార్థసారథి రెడ్డి సంయుక్తంగా బియన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్`. అరుణ్ తేజ్ , ఛరిష్మా శ్రీకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం ఫిలింనగర్ టెంపుల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా `మా` అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బి.యన్.రెడ్డి అభినయ మాట్లాడుతూ...``నా కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన మా నిర్మాతలకు కృతజ్క్షతలు. వారు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మంచి టీమ్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథ విషయానికొస్తే...బాగా డబ్బున్న వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడి మానవత్వం ఎలా ఉంటుంది? అనేది మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. క్యూట్ లవ్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు నుండి షెడ్యూల్ ప్రారంభమైంది. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం. విదేశాల్లో పాటలు చిత్రీకరించాలన్న ఆలోచనలో ఉన్నాం`` అన్నారు.
చిత్ర నిర్మాతలు డా.ఎస్. కీర్తి, డా. జి. పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ... ``బి.యన్.రెడ్డి గారి పట్టుదల, తపనతో పాటు కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాం. బియన్ రెడ్డిగారికి సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తారన్న నమ్మకం ఉంది. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించడానికి దర్శకుడికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. దర్శకుడిగా తనకు నిర్మాతలుగా మాకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. ఐదు అద్భుతమైన పాటలు రవికళ్యాణ్ గారు కంపోజ్ చేశారు. ఇప్పటి వరకూ అన్ని చాలా బాగా వచ్చాయి. ఇక మీదట కూడా ఇలాగే ప్రతిది సంతృప్తికరంగా వస్తుందన్న నమ్మకం ఉంది. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం`` అన్నారు.
చిత్ర సమర్పకులు యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ... `` సీనియర్ నటీనటలుతో పాటు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు బియన్ రెడ్డిగారికి నాటక రంగంలో మూడు నంది అవార్డులు వచ్చాయి. అభినయ ఆర్ట్స్ పై ఆయన ఎన్నో నాటకాలు చేశారు. అలాంటి ఒక ప్రతిభావంతడితో... వైద్యరంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.ఎస్.కీర్తిగారు, గైనాకాలజిస్ట్ డా.జి. పార్థసారథిరెడ్డిగారు ఈ చిత్రాన్ని తొలిసారిగా నిర్మిస్తున్నారు. వైద్య రంగంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఈ సినిమా ద్వారా అభిరుచి గల నిర్మాతలుగా ఈ `నీతోనే హాయ్ హాయ్` చిత్రంతో పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా`` అన్నారు.
నటుడు నారాయణరావు మాట్లాడుతూ... ``బియన్ రెడ్డిగారు నాకు పదేళ్లుగా తెలుసు. సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. వైద్య రంగంలో ఎంతో పేరుగాంచిన ఇద్దరు డాక్టర్లు ఒక చక్కటి టైటిల్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రం విజయవంతం కావాలన్నారు.
నటుడు బెనర్జి మాట్లాడుతూ... ``కథ చాలా బాగుంది. ఇందులో నేనొక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నా. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అవుతోన్న దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు`` అన్నారు.
నటుడు ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ... ``ఇంత వరకు చేయని ఓ విభిన్నమైన పాత్ర ఈ చిత్రంలో చేస్తున్నా`` అన్నారు.
హీరో అరుణ్ తేజ్ మాట్లాడుతూ... ``నేను తమిళంలో ఒక చిత్రంలో చేశాను. `చంద్రుళ్లో ఉండే కుందేలు` తర్వాత తెలుగులో చేస్తోన్న రెండో చిత్రమిది`` అన్నారు.
హీరోయిన్ ఛరిష్మా శ్రీకర్ మాట్లాడుతూ...``క్యూట్ లవ్ స్టోరితో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేనో క్యూట్ క్యారక్టర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
ఆనంద్, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, జయచంద్ర, రత్న ప్రభ, శ్రీప్రియ, జబర్దస్త్ రామ్ ప్రసాద్, జబర్దస్త్ పవన్, భాను ప్రకాష్, అడప రామారావు, రవి ఆనంద్, జి.లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి డి.ఓ.పిః ఈదర ప్రసాద్; సంగీత దర్శకుడుః రవి కళ్యాణ్; సాహిత్యంః వెంకట బాలగోని, ప్రవీణ్; ఎడిటర్ః ఆనంద్ పవన్ ; కొరియోగ్రఫీః సాయి రాజ్; ప్రొడక్షన్ కంట్రోలర్ః మట్టా కృష్ణారెడ్డి; కో-డైరక్టర్ః నవీన్; ఫైట్స్ః రవి; ఆర్ట్ః సుబ్బారావు పి.ఆర్.ఓః రమేష్ చందు; అసోసియేట్ డైరక్టర్ః మహేష్; అసిస్టెంట్ డైరక్టర్ః వెంకట్ డి, సిసింద్రి; పబ్లిసిటీ డిజైనర్ః ఇమేజ్ 7; మేకప్ః బి.యన్.బాబు; కాస్ట్యూమ్స్ః కృష్ణ; సమర్పణః యలమంచిలి ప్రవీణ్; ప్రొడ్యూసర్స్ః .డా. ఎ.స్. కీర్తి, డా.జి.పార్థసారథి రెడ్డి; కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్ః బి.యన్.రెడ్డి అభినయ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout