సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీ ప్రేమే నా ప్రాణం'
Send us your feedback to audioarticles@vaarta.com
Dr శ్రీహరి హీరోగా నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం 'నీ ప్రేమే నా ప్రాణం'. వై. రాజశేఖర్ దర్శకుడు. నిఖిత రెడ్డి హీరోయిన్. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ... "నేను విశాఖపట్నం , హైదరాబాద్ లలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చదివింది MBBS అయినా , సినిమా లు అంటే చాలా ఇష్టం .ఆ ఇష్టం తోనే నిర్మాత గా , హీరో గా ఈ సినిమా నిర్మిస్తున్నా. ఈ చిత్ర కథ విషయానికొస్తే...కొన్ని కోట్ల అధిపతి అయిన హీరో ఓ అమ్మాయి ప్రేమలో పడి చివరకు దేవదాసుగా మారతాడు. ప్రేమ కోసం పిచ్చివాడై, రోడ్లపై బిచ్చగాడిలా తిరుగుతుంటాడు. ఏ ప్రేమ అయితే హీరోని బిచ్చగాణ్ణి చేసిందో చివరకు అదే ప్రేమ మా హీరో ని ఓ జిల్లా కలెక్టర్ అంతటి వాని ని కూడా చేస్తుంది. అది ఎలా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నిజమైన ప్రేమకు నిర్వచనం ఏంటో మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. హీరో తన ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడమే కాకుండా , ఆత్మహత్య చేసుకుకోవడానికి కొన్ని సార్లు ప్రయత్నిస్తాడు. నిజంగా ఇలాంటి ప్రేమికుడు కావాలని సినిమా చూసిన ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యేలా ఇందులో లవ్ సీన్స్ ఉంటాయి. నిస్వార్ధమైన ప్రేమని దర్శకుడు చాలా బాగా చూపించాడు. ఎక్కడా రాజీ పడకుండా అందమైన లొకేషన్స్ లో సినిమాను తెరకెక్కించాం. బాల్య నటులుగా దీప్తాన్షు , చార్వి నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే మంచి కుటుంబ కథా చిత్రమిది. సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. డిసెంబర్ లో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com