తెలంగాణలో కొత్తగా 2817 కేసులు..

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు మూడు వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కరోనా హెల్త్ బులిటెన్‌ను గురువారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2817 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 1,33,406కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 856కు చేరుకుంది.

కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,611 మంది డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 1,00,013 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 32,537 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 74.9 శాతం ఉండగా.. మరణాల రేటు 0.64 శాతంగా ఉంది. కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 216, కరీంనగర్‌ 164, ఖమ్మం 157, నల్గొండ 157, మేడ్చల్‌ 129, సిద్దిపేట 120, సూర్యాపేట 116, వరంగల్‌ అర్బన్‌ 114 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.