Droupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి సింప్లిసిటీ... స్వయంగా చీపురుపట్టి ఊడ్చిన ద్రౌపది ముర్ము
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోన్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును బీజేపీ ఎంపిక చేసింది. తద్వారా ఈ అత్యున్నత పదవికి రేసులో నిలిచిన ఆదివాసి మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు. ప్రస్తుతం రాష్ట్రాల శాసనసభలు, లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయే బలం, ఇతర రాజకీయ పక్షాల మద్ధతును దృష్టిలో పెట్టుకుంటే ద్రౌపది ముర్ము ఎన్నిక పెద్ద కష్టమేమి కాదు. ఎందరో హేమాహేమీలను కాదని బీజేపీ పెద్దలు ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణ జూనియర్ అసిస్టెంట్‌గా కెరీర్:
ఒడిశా ఇరిగేషన్ శాఖలో సాధారణ జూనియర్ అసెస్టింట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా,మంత్రిగా, గవర్నర్‌గా పలు హోదాల్లో పనిచేశారు. ఎంతటి స్థాయికి వెళ్లినా నిరాడంబరంగా వుండటం ద్రౌపది ముర్ము ప్రత్యేకత. తాజాగా రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో ఊడ్చిన ద్రౌపది:
తన స్వగ్రామం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి ద్రౌపది వెళ్లారు. అయితే ఆలయంలో దేవుడిని దర్శించుకోకుండా.. దేవస్థాన ప్రాంగణాన్ని స్వయంగా చీపురు పట్టి శుభ్రపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే అనేక కీలక పదవులు నిర్వర్తించి.. ప్రస్తుతం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైనప్పటికీ ఆ హోదాలన్నీ పక్కనబెట్టి సాధారణ భక్తురాలిగా వ్యవహరించిన ద్రౌపది ముర్ముపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ద్రౌపది ముర్ముకు నవీన్ పట్నాయక్ అభినందనలు:
మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన ద్రౌపది ముర్ముకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలియజేశారు. ఇది తమ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని సీఎం అన్నారు. అటు ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. దీంతో ఆమెకు సీఆర్‌పీఎఫ్ కమాండోలు రక్షణగా వుండనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments