Modi: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది: ప్రధాని మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ మే 13న జరగబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక జరగనుంది. నేటితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ముగుస్తుంది. దీంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొన్నటి వరకు రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొన్న పార్టీల అధినేతలు.. ఇప్పుడు మీడియా ఛానల్స్‌కు ఇంటర్వూస్ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తొలిసారి ఓ తెలుగు ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. టీడీపీ, జనసేన ఎన్డీఏలో ఉన్నాయి కదా.. జగన్ మీతో ఉన్నట్లా.. లేనట్లా..? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఏపీలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.
"ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగలేదు.. ఆ ప్రభావం కిందవరకు వెళ్లింది. జగన్ ఎప్పుడూ మాకు రాజకీయ మిత్రపక్షం కాదు. పార్లమెంట్‌లో కీలకమైన బిల్లుల విషయంలో సందర్భాన్ని బట్టి మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో జగన్‌ను మా ప్రత్యర్థిగానే కొట్లాడం. ఆయన ఓ రాష్ట్ర సీఎం.. నేను దేశ ప్రధాని. ప్రధాని హోదాలో రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీయైనా.. ఏ రాష్ట్రమైనా నా తోడ్పాటు ఉంటుంది. ఏపీకి కూడా కేంద్రం తరపున చేయాల్సింది చేశాం. దేశంలో ప్రతి రాష్ట్రానికి తోడ్పాటు అందించడం మా బాధ్యత.
"టీడీపీ గతంలోనే ఎన్డీఏలో భాగంగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా మాతో కలిసి వస్తోంది. జనాల మద్దతు చూస్తుంటే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని పక్కాగా భావిస్తున్నాను. అలాగే ఎంపీ సీట్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలుస్తామని నమ్మకం ఉంది" అని తెలిపారు. దీంతో ఏపీలో టీడీపీ కూటమి విజయం ఖాయమని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కూటమిలో బీజేపీ చేరిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి మూడు సార్లు ప్రచారానికి వచ్చారు. మొత్తం నాలుగు సభలతో పాటు విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఇక సభల్లో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ గూండాలకు పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com