ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ అనుమానాస్పద మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ దేశ రాజధాని ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్ ఢిల్లీలోని మాక్స్ సాకేత్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే మరణించారని మరోవైపు వార్తలు వినవస్తున్నాయి.
అయితే రోహిత్ మృతి చెందినట్లు వైద్యులు కొద్దిసేపటి క్రితమే నిర్ధారించారు. కాగా.. 39 ఏళ్ల రోహిత్ ఎలా చనిపోయారనే విషయం మాత్రం తెలియరాలేదు. రోహిత్ మృతిని దక్షిణ ఢిల్లీ డీఎస్పీ విజయ్‌కుమార్ ధ్రువీకరించారు. రోహిత్ శేఖర్ ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఘటన జరిగే సమయానికి రోహిత్ తల్లి అతని నివాసంలో లేరని తేలింది.
కాగా.. 2014లో కోర్టులో వ్యాజ్యం పడటం, డీఎన్ఏ టెస్ట్ తర్వాత తివారీ దిగొచ్చి రోహిత్ తన కొడుకేనంటూ తివారీ ఒప్పుకున్న విషయం తెలిసిందే. తివారీ తనను కొడుకుగా స్వీకరించాలని రోహిత్ న్యాయం కోసం కోర్టుకు ఎక్కడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పలు పర్యాయాలు నిరాకరించినప్పటికీ తివారీ డీఎన్ఏ పరీక్ష అనగానే దిగివచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments