BRS Party:సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు ఈసీ షాక్ : 'జాతీయ' పార్టీగా ఆప్.. బీఆర్ఎస్‌కు ఏపీలో గుర్తింపు రద్దు

  • IndiaGlitz, [Tuesday,April 11 2023]

మరికొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రస్తుతం జాతీయ పార్టీలుగా వెలుగొందుతున్న తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈ పార్టీల జాతీయ హోదాను ఈసీ తొలగించింది. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ ఎన్నికల ఫలితాల ఆధారంగా సామాన్యుడి పార్టీకి జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ నిర్ణయంతో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్‌పీ, ఆప్‌లు మాత్రమే ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీలుగా నిలిచాయి.

కేసీఆర్‌కు షాకిచ్చిన ఈసీ :

ఇక ఎన్నో అంచనాలతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఈసీ షాకిచ్చింది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఏపీలో గుర్తింపు తొలగించింది. కేవలం తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్‌ను రాష్ట్ర పార్టీగా గుర్తించింది. దీనికి కారణం లేకపోలేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీగా గుర్తింపు వుంది. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కేవలం తెలంగాణలోనే పోటీ చేసిన ఆ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందుకుంది. కానీ ఏపీలో మాత్రం పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీ హోదాను ఈసీ రద్దు చేసింది. ఇదిలావుండగా.. యూపీలో ఆర్ఎల్‌డీ, మణిపూర్‌లో పీడీఏ , పుదుచ్చేరిలో పీఎంకే, బెంగాల్‌లో ఆర్ఎస్‌పీ, మిజోరంలలో ఎంపీసీలకు ఇచ్చిన రాష్ట్ర పార్టీ హోదాను కూడా ఎన్నికల సంఘం తొలగించింది.

జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే:

ఓ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే ఎన్నికల సంఘం పలు నియమ నిబంధనలు సూచించింది.

అవేంటంటే:

కనీసం నాలుగు రాష్ట్రాల్లో పార్టీకి .. రాష్ట్ర పార్టీగా గుర్తింపు వుండాలి
దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు సంపాదించాలి
నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల్లో 4 ఎంపీ సీట్లు సాధించాలి.

More News

Allu Arjun:సినీ జనాలకు షాకిచ్చిన అల్లు అర్జున్ : షారుఖ్ ‘‘జవాన్’’లో కీ రోల్‌.. సైలెంట్‌గా షూట్ పూర్తిచేశాడట..?

బాహుబలి సిరీస్ , పుష్ప, ఆర్ఆర్ఆర్ , కార్తీకేయ తదితర సినిమాలు బ్లాక్‌బస్టర్‌లు కావడం.

Natti Kumar :కొందరికి తెలియదు, కొందరినీ పిలవలేదు.. ఆస్కార్ విజేతలను ఇలాగేనా గౌరవించేది : నట్టి కుమార్ ఆరోపణలు

తెలుగు చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ని ముద్దాడి దేశానికి కానుక ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి.

Radhika Apte : హీరోల రెమ్యూనరేషన్‌పై రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు

రాధికా ఆప్టే.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

Pawan Kalyan:పవన్ చేతికి తాబేలు ఉంగరం గమనించారా.. ఈసారి జనసేనాని జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం

Game On:సమ్మర్‌లో ‘గేమ్‌ఆన్‌’

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో