శివసేనకు ఎన్సిపి షాక్ ... మహారాష్ట్ర సీఎం గా ఫడ్నవీస్ ప్రమాణం
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. నిన్నటి వరకు శివసేన , ఎన్సిపి, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించిన... అలా జరగలేదు. శివసేనకు ఎన్సీపీ హాండ్ ఇచ్చి.... బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ మలుపులు ఫుల్ స్టాప్ పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడం తో రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.
మొత్తానికి సీఎం పీఠంపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూర్చోవడం ఖాయం అనుకుంటున్న తరుణంలో రాత్రికి రాత్రి రాజకీయ సమీకరణలు మారిపోయాయి. శివసేన ఆశలపై నీళ్లు జల్లుతూ.. ఎన్సిపి, బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది. ఫైనల్ గా మోడీ షా ద్వయం మరోసారి రాజకీయంలో తమకెవరు సరిలేరు అని రుజువు చేశారు. మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయినప్పుడే... మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది అనుకున్నారు అంతా. ఆ అనుమానమే ఈరోజు నిజమైంది .. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments