Balayya:బాలయ్యతో 'యానిమల్' వైల్డెస్డ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేస్తున్న ఈ షో మూడవ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో 'భగవంత్ కేసరి' మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల ఈ షోలో పాల్గొని సందడి చేశారు. తాజాగా 'యానిమల్' మూవీ టీమ్ ఈ షోలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఆహా సంస్థ విడుదల చేసింది.
ఈ ప్రోమోలో బాలయ్య బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో కలిసి రచ్చ చేశారు. డ్యాన్సులు వేస్తూ, సరదా ప్రశ్నలు వేస్తూ హల్‌చల్ చేశారు. అంతేకాకుండా రష్మికతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకి కాల్ చేయించి ఆట పట్టించారు. ప్రోమోలోనే ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఫుల్ ఎపిసోడ్‌లో ఇంకెత ఫన్ ఉండనుందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 24న ఈ వైల్డ్ ఎపిసోడ్ ఆహాలో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది.
ఇక గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేశ్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా నటించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే కథతో 'యానిమల్' చిత్రం ఉండబోతున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని భావించినా.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 1న రిలీజ్ చేస్తు్న్నారు.
🦁#UnstoppableWithNBK Wildest episode is Promo.
— IndiaGlitz Telugu™ (@igtelugu) November 18, 2023
🗓️Mark your calendars for the Wildest Entertainment Feast…
Nov 24 on🔥@ahavideoIN #NandamuriBalakrishna #RashmikaMandanna #RanbirKapoor @iamRashmika @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/WtCpilQYzu
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com