NBK Season 3:గెట్ రెడీ.. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అన్‌స్టాపబుల్ విత్ NBK 3వ సీజన్ వచ్చేస్తోంది..

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

నటసింహం నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్ చూపించిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్‌ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేస్తున్న ఈ షో మూడవ సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆహా సంస్థ క్లారిటీ ఇస్తూ అధికారికంగా ట్వీట్ చేసింది. నిజమే మీరు విన్నది.. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అన్‌స్టాపబుల్ విత్ NBK మళ్లీ రానుంది. కానీ ఈ సారి లిమిటెడ్ ఎడిషన్స్‌తో మాత్రమే అని తెలిపింది. ఎన్నికల సీజన్ కావడంతో ఈ సీజన్‌లో తక్కువ ఎపిసోడ్‌లు ఉండే మాత్రమే ఉండనున్నాయి.

సీజన్ 1, సీజన్‌ 2లతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్..

ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 1, సీజన్‌ 2లో ప్రసారం అయిన 20 ఎపిసోడ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా, ఏ షోకు రాని విధంగా సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఈ షోకు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని, గోపిచంద్ లాంటి వారే కాకుండా యువ హీరోలు శర్వానంద్, రానా, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి వారు కూడా పాల్గొని ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి రావాలని కోరుకుంటున్న నెటిజన్లు..

ఈ షోకి సీజన్ 3 కూడా ఉంటుందని కొద్దికాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ఆహా ఓటీటీ ప్రకటించింది. దీంతో ఈ షోలో ఎలాంటి సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు వస్తారో అనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ టాక్ షో ప్రారంభమైన దగ్గరి నుంచి మెగాస్టార్ చిరంజీవి వస్తారనే ప్రచారం జరిగింది. తొలి రెండు సీజన్లకు రాలేకపోయిన చిరంజీవి కనీసం ఈ సీజన్లో అయిన వస్తారేమోనని ఆశిస్తు్న్నారు. ఆయన వస్తే మాత్రం చిరును బాలయ్య ఇంటర్వ్యూ చేయడం రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

More News

Israel:ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధ వాతావరణం.. భారతీయులకు కీలక సూచనలు

ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడి భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది.

Chikoti Praveen:ఎట్టకేలకు బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీకే అరుణ

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు తెలంగాణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ కాషాయం కండువా కప్పుకున్నారు.

Asian Games:ఆసియా క్రీడల్లో దుమ్మురేపుతున్న భారత ఆటగాళ్లు.. క్రికెట్, బ్యాడ్మింటన్‌, కబడ్డీలో స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఈవెంట్ ఏదైనా సరే మెడలే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు.

MP Navneet Kaur:మంత్రి రోజాకు మద్దతుగా ఎంపీ నవనీత్ కౌర్.. బండారు వ్యాఖ్యలపై మండిపాటు

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Sharmila:కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి బ్రేకులు.. షర్మిల ఒంటరి అయిపోయారా..?

ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయగా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.