NBK 109:"బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్".. NBK109 షూటింగ్ షురూ..
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ రూ.100కోట్ల క్లబ్లో చేరారు. దీంతో బాలయ్య తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తీసిన దర్శకడు బాబీ NBK109 సినిమాకు దర్శతక్వం వహిస్తున్నారు. ఇటీవలే NBK 109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం కూడా జరిగింది. "ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు" అనే కొటేషన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులకు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి మొదలైనట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ విషయం తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఓ గొడ్డలికి ఆంజనేయస్వామి లాకెట్ ఉన్న దండతో పాటు కళ్లజోడు ఉంది. ఆ కళ్లజోడులో పోరాట సన్నివేశాలు చూపిస్తున్నారు. అంతేకాకుండా "బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్", "వైలెన్స్ కి విజిటింగ్ కార్డు" క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. 1980ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఇక వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రేపు (నవంబర్ 9) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో "బాక్సాఫీస్ కా షేర్ సెలెబ్రేషన్స్" నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటివరకు రూ.130 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా నవంబర్ చివరి వారంలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com