నానితో సినిమా స్టార్ట్.. వెల్లడించిన హీరోయిన్ నజ్రీయా
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలో ఎవరైనా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తారంటే.. పక్కాగా వారిలో ముందు వరసలో నేచురల్ స్టార్ నాని పేరుంటుంది. అంతేకాదు.. పక్కా ప్లానింగ్‌తో వెళుతూ.. సినిమాలను పూర్తి చేసే రేసులోనూ నాని ఇతర హీరోల కంటే చాలా ముందున్నాడు. ఇప్పటికే 'టక్ జగదీష్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల చేసే నిర్ణయాన్ని చిత్ర యూనిట్ వెనక్కి తీసుకుంది. మరొక డేట్ చూసుకుని ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు.
మరో వైపు 'శ్యామ్ సింగరాయ్' సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌ను సైతం నాని స్టార్ట్ చేసేశాడు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో 'అంటే సుందరానికీ!' సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని అనౌన్స్మెంట్ రోజునే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. చెప్పినట్లుగానే సమ్మర్లో షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన విషయాన్ని సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న నజ్రియా నజీమ్ తెలియజేసింది.
ఈ ముద్దుగుమ్మ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో "అందరికీ నమస్కారం..ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. తొలిసారిగా చేసేది ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి 'అంటే సుందరానికీ' చాలా స్పెషల్" అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా 'అంటే సుందరానికీ!' సినిమా రూపొందుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com