జులై 21న 'వాసుకి' విడుదల
Saturday, July 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరామ్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సినిమా 'వాసుకి'. నయనతార టైటిల్ పాత్రలో నటించింది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన 'పుదియనియమం' సినిమాకు తెలుగు అనువాదమే 'వాసుకి'. ఈ సినిమా ట్రైలర్, పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యకమ్రంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..ట్రైలర్, సాంగ్ నాకు బాగా నచ్చాయి. డబ్బింగ్ సినిమాలకైనా, రెగ్యులర్ సినిమాలకైనా మంచి కథ, మంచి సంగీతం, కథను చక్కగా తెరకెక్కింగల దర్శకుడు అవసరం. ఈ మూడు అంశాలు ఈ సినిమాకు ఉన్నాయి. నయనతార నటించడం వల్ల మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. ప్రతి జనరేషన్లో మేల్ హీరో రేంజ్లో ఫిమేల్ హీరోయిన్ కూడా ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి, ఇప్పుడు అనుష్క, నయనతారలున్నారు. మెయిన్హీరోస్కు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ వీరిది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. శ్రీరాం సహా టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ - ''అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఈ సినిమాను చూడాలనుకుని చాలా రోజుల నుండి అనుకుంటున్న తరుణంలో సినిమా తెలుగులో విడుదల కావడం ఆనందంగా ఉంది. శ్రీరాంగారికి, ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - '''పుదియ నియమం' సినిమా మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ సాధించి ఎంటైర్ యూనిట్‌కు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''శ్రీరామ్‌గారు కొత్త నిర్మాత అయినా సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉంది. వేరే వాళ్ళు సినిమాను కొన్నప్పటికీ నచ్చడంతో వారి నుండి ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నాడు. నయనతార అంటే హీరోకు సమానమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా సినిమా పెద్ద హిట్ సాధిస్తుందని కోరుకుంటున్నాను'' అన్నారు.
రాజ్‌మాదిరాజ్ మాట్లాడుతూ - '''పుదియనియమం' సినిమాను చూసి హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్న సమయంలో ఈలోపు శ్రీరామ్‌గారు డబ్బింగ్ రైట్స్ తీసేసుకున్నారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది'' అన్నారు.
ఎస్.ఆర్.శ్రీరామ్ మాట్లాడుతూ - ''నేను లాయర్ని. ఈరోజు నేను సినిమా విడుదల చేసే స్థాయికి వచ్చానంటే కారణం కూడా సినిమానే. సినిమాలంటే ఉన్న ఆసక్తితో డబ్బులు కూడబెడుతూ వచ్చి ఈ సినిమా హక్కులను కొని తెలుగులో విడుదల చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాను. అందువల్ల ప్రేక్షకుల ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. ఈ సినిమాను జులై 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments